తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కూల్ న్యూప్.. 3 రోజులు వానలు

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చ‌ల్ల‌ని వార్త‌ చెప్పారు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు. రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతోపాటు ఓ మోస్తరు వరకూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఉమ్ ఫున్ తుఫాను కార‌ణంగా గాలిలో తేమ శాతం త‌గ్గిపోవ‌డంతో..గ‌త కొన్ని రోజులుగా ప్ర‌జ‌లు వేడి, వడగాడ్పులతో అల్లాడిపోతున్న జనానికి ఇది కాస్త‌ ఉప‌శ‌మ‌నం క‌లిగించే వార్త‌నే చెప్పాలి. రాగల 24 […]

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కూల్ న్యూప్.. 3 రోజులు వానలు
Follow us

|

Updated on: May 29, 2020 | 10:30 PM

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చ‌ల్ల‌ని వార్త‌ చెప్పారు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు. రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతోపాటు ఓ మోస్తరు వరకూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఉమ్ ఫున్ తుఫాను కార‌ణంగా గాలిలో తేమ శాతం త‌గ్గిపోవ‌డంతో..గ‌త కొన్ని రోజులుగా ప్ర‌జ‌లు వేడి, వడగాడ్పులతో అల్లాడిపోతున్న జనానికి ఇది కాస్త‌ ఉప‌శ‌మ‌నం క‌లిగించే వార్త‌నే చెప్పాలి.

రాగల 24 గంటల్లో మాల్దీవులు, కోమోరిన్‌, సౌత్ బే ఆఫ్ బెంగాల్ లోని కొన్ని ఏరియాలు, అండమాన్‌ సముద్రం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో… నైరుతి రుతుపవనాలు విస్తరించే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. అంతేకాక, ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్ర ఏరియాల్లో ఈ నెల 31న అల్పపీడనం ఏర్ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు.

దీని ప్రభావం వల్ల జూన్‌ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి వెల్లడించారు. మరోవైపు పశ్చిమ మధ్య అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి అరేబియా సముద్రం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల పశ్చిమ మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని చెప్పారు.