Breaking News
  • అమరావతి: సీఎంకు ప్రధాని ఫోన్‌, అమరావతి: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌కు ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, అనంతర పరిస్థితులను అడిగితెలుసుకున్నారు. రాష్ట్రంలో వర్షప్రభావిత ప్రాంతాలు, నెలకొన్న పరిస్థితులను సీఎం ప్రధానికి వివరించారు. వాయుగుండం తీరందాటిందని, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించారు. అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు.
  • గ్రేటర్ హైదరాబాద్ నగరం లో విద్యుత్ సరఫరా పరిస్థితి, నష్ఠాలపై చీఫ్ జనరల్ మేనేజర్, సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించిన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి. . భారీ వర్షం, గాలులకు 686 ఫీడర్లు దెబ్బతిన్నాయి. వాటిలో 671 ఫీడర్లలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం - సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి 15 పెండింగ్ ఫీడర్లు మరి కొద్దీ సమయంలో పునరుద్ధరిస్తాం. వినియోగదారులు సంస్థతో సహకరించగలరు - సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి 15 నెం 33/11 కేవీ సబ్ స్టేషన్లలో వరద నీరు చేరింది. వరద నీరుని బయటకి తోడి సబ్ స్టేషన్లను ఛార్జ్ చేయడం జరిగింది - సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థ కు తెలియజేయగలరు - సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి. 6. వోల్టేజ్ లో హెచ్చు తగ్గులు వున్నా, విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగితే 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగలరు - సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి.
  • హైదరాబాద్: టీవీ9 కథనాలతో స్పందించిన మెట్రో అధికారులు. మూసాపేట మెట్రో పిల్లర్ దగ్గర కుంగిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాం. ప్రయాణికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐడీపీఎల్ చెరువు నుంచి వచ్చిన నీటి కారణంగా భూమి కుంగింది. - హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి.
  • అమరావతి : ఐఏఎస్ బదిలీ. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బదిలీ. జిఏడి కి రిపోర్ట్ చేయాలని ఆదేశం . ప్రస్తుతం ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్. వాటితో పాటు సిసిఎల్ఏ కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలు చూస్తున్న నీరబ్ కుమార్ . జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాద్ దాస్ కు ఆ శాఖల అదనపు బాధ్యతలు.
  • విజయవాడ : దసరా ఉత్సవాల సందర్భంముగా 17 నుండి 25 వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించిన సీపీ బత్తిన శ్రీనివాసులు . విజయవాడ మీదుగా ఇతరప్రాంతాలకు వెళ్లే వాహనాలకు సిటీలోకి అనుమతి లేదు - సీపీ బత్తిన శ్రీనివాసులు .
  • ప్రకాశం : అద్దంకి మండలం తిమ్మాయపాలెంలో విషాదం... పొలంలో బురదలో ఇరుక్కున్న ట్రాక్టర్‌ను బయటకు తీసే ప్రయత్నంలో ట్రాక్టర్ తిరగబడి తోకల సుబ్బారావు మృతి... కొడుకు మృతి సమాచారం తెలుసుకుని గుండెపోటుతో తల్లి రాఘవమ్మ అక్కడికక్కడే మృతి.
  • 24 గంటల్లో 24 మంది మృతి. పల్లె చెరువులో 6 మృతదేహాలు గుర్తింపు, మరో 9 మంది గల్లంతు. Sr నగర్ లో ఇద్దరు మృతి. దిల్ సుఖ్ నగర్ లో మూడేళ్ల చిన్నారి సెల్లార్ నీటిలో మృతి. పాతబస్తీ లో గోడ కూలి 9 మంది మృతి.

ముంబైకి పొంచిఉన్న వానగండం.. రెడ్ అలర్ట్ ప్రకటించిన సర్కార్

దేశ ఆర్థిక రాజధాని ముంబై గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉపిరి పీల్చుకోలేక పోతోంది. అటు అధికారులు మాత్రం మరో వాన గండం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.

rains continue to lash mumbai imd red alert for today, ముంబైకి పొంచిఉన్న వానగండం.. రెడ్ అలర్ట్ ప్రకటించిన సర్కార్

దేశ ఆర్థిక రాజధాని ముంబై గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉపిరి పీల్చుకోలేక పోతోంది. అటు అధికారులు మాత్రం మరో వాన గండం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. గురువారం ముంబైతో పాటు మహారాష్ట్రలో భారీ నుంచి అతిభారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్రలోని ముంబైతోపాటు థానే, పూణే, షోలాపూర్, ఉత్తర కొంకణ్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలతో ముంబై నగరంలోని పలుప్రాంతాలు నీటమునిగాయి.

షోలాపూర్ జిల్లాలో బుధవారం భారీ వర్షాల ధాటికి ఆరుగురు ప్రాణాలను కోల్పోయారు. పూణే జిల్లా నింగాన్ కేట్కీ గ్రామంలో వరదనీటిలో చిక్కుకున్న 40మందిని సహాయ సిబ్బంది కాపాడారు. ఇందాపూర్ లో మరో ఇద్దరు వరదనీటిలో కొట్టుకుపోతుండగా సిబ్బంది కాపాడారు. ముంబైలో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని బీఎంసీ అధికారులు సూచించారు.

Related Tags