వెదర్ అలెర్ట్ : ఏపీలో 3 రోజులు వర్షాలు

ఉత్తర ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

వెదర్ అలెర్ట్ : ఏపీలో 3 రోజులు వర్షాలు
Follow us

|

Updated on: Oct 01, 2020 | 7:46 PM

ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై పడనుంది. దీంతో రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వివరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. శుక్ర,శని వారాల్లో ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు నుంచి వరుసగా మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

Also Read :దేశంలో కరోనా కలవరం, 24 గంటల్లో 1,181 మరణాలు