యువర్ అటెన్షన్ ప్లీజ్ !

దసరా పండుగ సీజన్ వస్తోంది. ఇక రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడిపోతాయి. అయితే ఈసారి కరోనా మహమ్మారి నేపథ్యంలో మరింత జాగ్రత్తలు అవసరం. అందుకే ఇండియన్ రైల్వేస్ మరిన్ని కొత్త రైళ్ల‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధం అవుతోంది.

  • Tv9 Telugu
  • Publish Date - 1:21 pm, Wed, 23 September 20
యువర్ అటెన్షన్ ప్లీజ్ !

దసరా పండుగ సీజన్ వస్తోంది. ఇక రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడిపోతాయి. అయితే ఈసారి కరోనా మహమ్మారి నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. అందుకే ఇండియన్ రైల్వేశాఖ కొత్త ట్రైన్స్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. దీంతో దసరా, దీపావళి పండుగలకు ఊర్లకు వెళ్లేవారికి కాస్త ఊరట కలుగనుంది.

దసరా పండుగ సీజ్ వచ్చిందంటే రైళ్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోతాయి. రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడిపోతాయి. అసలే కరోనా అపై జనం రద్దీ పెరిగితే పరిస్థితి ఏంటని ఆలోచించేవారికి రైల్వేస్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఈ సారి రద్దీని తట్టుకునేందుకు మరిన్ని ట్రైన్స్ అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. అక్టోబర్-నవంబర్ పండుగ సీజన్‌ కోసం ఇండియన్ రైల్వేస్ మరిన్ని స్పెషల్ ట్రైన్స్‌ను నడిపేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది.

దీనికి సంబంఇంచి రైల్వే మంత్రిత్వ శాఖ వచ్చే నెలలో ప్రకటన చేసే అవకాశం వుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో మరిన్ని అదనపు రైళ్లు వేయాలని భావిస్తోంది. కాగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ లాక్ డౌన్ నేపథ్యంలో రైల్వే సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే.

 

ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతం స్పెషల్ ట్రైన్స్ మాత్రమే నడుపుతోంది. కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ ప్రకటించిన తర్వాత దశల వారీగా రైళ్ల సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. మరో 80 కొత్త స్పెషల్ ట్రైన్స్‌ను వచ్చే నెల నుంచి పట్టాలెక్కించడానికి ఇండియన్ రైల్వేస్ రెడీ అవుతున్నట్టు సమాచారం.

దసరా, నవరాత్రి, దీపావళి వంటివి పెద్ద పండుగలుగా దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడపాలని యోచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే రూట్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం వుంది. అందుకే ఇండియన్ రైల్వేస్ ముందుగానే తగిన చర్యలు తీసుకోనుంది. డిమాండ్ తగినట్లుగా కొత్త రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధం అవుతోంది.