Breaking News
  • ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ప్రగతిభవన్లోమంత్రులభేటీ. సీఎం ఆదేశాల మేరకు ఇవాళ మంత్రివర్గ సహచరులతో పరిశ్రమలు - వాణిజ్యశాఖ మంత్రి కేటీ రామారావు భేటీ. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపై మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్.
  • గుంటూరు : అనుమతులు లేకుండా కొవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి సీజ్‌. గుంటూరువారితోట 7వలైనులో అనధికారికంగా కొవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న బండ్లమూడి ఆసుపత్రి నిర్వాహకులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ పేషెంట్లు. పేషెంట్లను కొవిడ్‌ ఆసుపత్రికి తరలించి ఆసుపత్రిని సీజ్‌ చేసిన అధికారులు.
  • తెలంగాణ అనేక కొత్త ప్రాజెక్ట్ లు చేపడుతోంది : సీఎం జగన్ . శ్రీశైలం ఎగువ నుండి 800 అడుగుల వద్ద రోజు కు 3 టీఎంసీ ల చప్పున 200 టీఎంసీ తరలిచే అవకాశం : సీఎం జగన్ . కృష్ణ బోర్డ్ ఆదేశాలను పక్కన పెట్టీ విద్యుత్ తయారీ చేయడం తో 42000 కసెక్ ల నీటి వినియోగము జరుగుతుంది : ఏపీ సీఎం . తెలంగాణ 800 అడుగుల వద్ద నీటిని తోడుకునే ఏర్పాటు చేసుకుని కేటాయింపుల ప్రకారం నీటిని వాడుకుంటాం అని చెపుతుంది : ఏపీ సీఎం. ఒకపక్క వారు 800 అడుగులు వద్ద నీటిని తోడుకుంటూ..... మేము 854 అడుగుల వద్ద తరలించడం ఎంత వరకు సమంజసం : ఏపీ సీఎం జగన్.
  • హిందీ దృశ్యం సినిమా దర్శకుడు నిషికాంత్ కామత్ పరిస్థితి విషమం . హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిషి కాంత్. కాలేయ సిరోసిస్‌ వ్యాధి తో భాధ పడుతున్న నిషి కాంత్. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా వుంది. Icu చికిత్స పొందున్నారు . హిందీ దృశ్యం, మాదారీ, ముంబై మేరీ జాన్ వంటి హిట్ సినిమాలకు దర్శకుడు. సాచి ఆత్ ఘరత్ వంటి కొన్ని మరాఠీ చిత్రాలలో కూడా నటించారు. 2005 లో మరాఠీ చిత్రం డొంబివాలి ఫాస్ట్‌తో ఆయన దర్శకుడిగా మారారు.
  • నెల్లూరు : కరోనాతో ముగ్గురు జర్నలిస్టుల మృతి. కరోనా తో చికిత్స పొందుతూ ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి మృతి. ఇందుకూరుపేట మండలానికి చెందిన ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు మృతి.. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు జర్నలిస్టులు మృతి.
  • రాజధాని వికేంద్రీకరణ మరియు సిఆర్డిఏ రద్దు బిల్లుల పై కోర్టు లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు బాధ్యతలు మునిపల్ శాఖ కార్యదర్శి శ్యామల రావు కి అప్పగింత . అనేక డిపార్ట్మెంట్ లను ప్రతివాదులుగా చేరుస్తున్న నేపధ్యంలో కౌంటర్ అఫిడవిట్ కోసం శ్యామల రావును నామినేట్ చేసిన సర్కార్ . చీఫ్ సెక్రటరీ తో సహా మిగిలిన అధికారుల బదులు కౌంటర్ అఫిడవిట్ లో శ్యామల రావు సంతకం చేసేలా ఆదేశం. శ్యామల రావు అందుబాటులో లేని పక్షంలో మునిసిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రామ్ మనోహర్ రావు కు ఆ బాధ్యతలు . ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.
  • తెలంగాణ కరోనా కేసుల అప్డేట్స్: తెలంగాణ లో కరోనా టెస్టింగ్స్ : 6,65,847. ఈ ఒక్కరోజే టెస్టింగ్స్: 22,972. రాష్ట్రంలో ఈరోజు పాజిటివ్ కేసులు : 1897. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు : 84,544. జిహెచ్ఎంసి లో ఈరోజు కేసులు: 479. జిహెచ్ఎంసి లో మొత్తం కరోనా కేసులు సంఖ్య : 43,858. కరోనా తో ఈరోజు మరణాలు : 09. ఇప్పటి వరకూ మరణాలు మొత్తం : 654. చికిత్స పొందుతున్న కేసులు : 22,596. ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయిన వారు: 1920. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య: 61294.

మనం చేసే ఆ పనులతో.. రైల్వేకు అక్షరాల తొమ్మిదివేల కోట్ల ఆదాయం..!

Railways Earned Rs. Nine Thousand Crore From Ticket Cancellation.. Other Charges, మనం చేసే ఆ పనులతో.. రైల్వేకు అక్షరాల తొమ్మిదివేల కోట్ల ఆదాయం..!

ఇండియన్ రైల్వేస్‌కు అక్షరాల తొమ్మిదివేల కోట్ల రూపాయల ఆదాయం. అది కూడా ప్రయాణికులు రైల్లో ఝర్నీ చేయకుండానే.. నిజం. మనం టిక్కెట్లు కొన్నాక.. కొన్ని అనివార్య కారణాలతో ప్రయాణాన్ని రద్దు చేసుకుంటాం. అప్పుడు ముందుగానే కొన్న రైల్వే టిక్కెట్లను రద్దు చేసుకుంటాం. అప్పుడు మనకు పూర్తి డబ్బులు కాకుండా.. సర్వీస్ ఛార్జీలు కట్ చేసి.. మిగతా అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారు. అయితే.. ఇలా ప్రయాణికులు చేసిన టిక్కెట్ల రద్దు అమౌంట్.. ఏకంగా రైల్వేకి తొమ్మిది వేల కోట్ల రూపాలయల లాభాలను తెచ్చిపెట్టింది.

గత మూడు ఏళ్లలో దేశవ్యాప్తంగా వెయిటింగ్‌ లిస్టులో ఉండి రద్దు కాని టికెట్ల ద్వారా రూ.9వేల కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే సమాచార సంస్థ కేంద్రం(సీఆర్‌ఐఎస్‌)వెల్లడించింది. రాజస్థాన్‌ కోటాకు చెందిన సామాజిక కార్యకర్త సుజిత్‌ స్వామి సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారంతో.. సీఆర్‌ఐఎస్‌ ఈ వివరాలను వెల్లడించింది.

జనవరి1, 2017 నుంచి జనవరి 31, 2020మధ్య.. దాదాపు మూడేళ్లలో.. తొమ్మిదిన్నర కోట్లమంది వెయిటింగ్‌ లిస్టులో ఉన్న ప్రయాణికులు వారి టికెట్‌ రద్దు చేసుకోలేదని తెలిపారు. దీని ద్వారా రూ.4335కోట్లు ఇండియన్ రైల్వేకు ఆదాయంగా వచ్చిందని.. ఈ మధ్య కాలంలోనే టిక్కెట్లు రద్దు చేసుకోవడంతో దానికి చెల్లించే రుసుముతో మరో రూ.4684కోట్లు ఆదాయం సమకూరిందని తెలిపింది. అయితే వీటిలో స్లీపర్‌క్లాస్‌ టికెట్ల నుంచే అధిక ఆదాయం రాగా.. తరువాతి స్థానంలో థర్డ్‌ఏసీ టికెట్లనుంచి వచ్చినట్లు పేర్కొంది.

Related Tags