ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. ప్రత్యేక రైళ్ల సమయాల్లో మార్పు..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ దేశవ్యాప్తంగా పలు ప్రత్యేక రైళ్లను తిప్పుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొన్ని స్పెషల్ ట్రైన్స్ టైమింగ్‌లో మార్పులు చేసినట్లు భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది.

ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. ప్రత్యేక రైళ్ల సమయాల్లో మార్పు..
Follow us

|

Updated on: Jul 11, 2020 | 4:13 PM

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ దేశవ్యాప్తంగా పలు ప్రత్యేక రైళ్లను తిప్పుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొన్ని స్పెషల్ ట్రైన్స్ టైమింగ్‌లో మార్పులు చేసినట్లు భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా తూర్పు జోన్ నుంచి తిరిగే ప్రత్యేక రైళ్ల షెడ్యూల్‌లో భారీ మార్పులు చేసింది. ఈ మార్పులు ఇవాళ్టి నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది.

ఇదిలా ఉంటే దేశంలో కరోనా కారణంగా పాసింజర్, ఎక్స్‌ప్రెస్‌, సబ్రాబాన్ రైళ్లు అన్నీ కూడా ఆగష్టు 12వ తేదీ వరకు రద్దు చేయబడ్డాయని గతంలోనే కేంద్ర రైల్వేశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే స్పెషల్ ట్రైన్స్, శ్రామిక్ రైళ్లు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. అటు 02303/02304 హౌరా- న్యూఢిల్లీ(వయా పాట్నా), 02381/02382 హౌరా- న్యూఢిల్లీ(వయా ధన్‌బాద్‌) స్పెషల్ ట్రైన్స్‌ షెడ్యూల్‌ను రైల్వే శాఖ కుదించింది.

కొత్త షెడ్యూల్ ఇలా ఉంది..

  • 02303- హౌరా- న్యూఢిల్లీ(వయా పాట్నా) ఎక్స్‌ప్రెస్‌ జూలై 11 నుంచి కేవలం శనివారాలు మాత్రమే తిరగనుంది.
  • 02304- న్యూఢిల్లీ- హౌరా(వయా పాట్నా) ఎక్స్‌ప్రెస్‌ జూలై 12 నుంచి ఆదివారాలు మాత్రమే తిరగనుంది.
  • అలాగే 02381- హౌరా- న్యూఢిల్లీ(వయా ధన్‌బాద్‌) ఎక్స్‌ప్రెస్‌ జూలై 16 నుంచి గురువారాలు.. 02382 న్యూఢిల్లీ- హౌరా(వయా ధన్‌బాద్‌) ఎక్స్‌ప్రెస్‌ జూలై 17 నుంచి శుక్రవారాలు మాత్రమే తిరుగుతాయని ఇండియన్ రైల్వేస్ తెలిపింది.
  • 02201/02202 Sealdah–Puri–Sealdah ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ కూడా భువనేశ్వర్‌తో ఆగిపోతుందని పేర్కొంది. ఇకపై ఈ ట్రైన్ వారంలో రెండు రోజుల మాత్రమే తిరుగుతుందని ప్రకటించింది.

Also Read:

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటికే ఉచితంగా కిట్లు పంపిణీ..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతీ జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్..!

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

ఏపీ ప్రజలకు గమనిక.. ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..

కరోనా కట్టడిలో జగన్ సర్కార్ దూకుడు.. ఇంటికే ఉచితంగా కరోనా కిట్..