Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

రాహుల్ రీ-ఎంట్రీ… పున్ను హగ్ ఫెస్టివల్ షురూ!

Rahul Sipligunj Enters Bigg Boss House With A Blast, రాహుల్ రీ-ఎంట్రీ… పున్ను హగ్ ఫెస్టివల్ షురూ!

బిగ్ బాస్‌ హౌస్‌లో పునర్నవి ఎడబాటుకు మోక్షం కలిగింది. ఆమె స్నేహితుడు, పులిహోర రాజాగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ మళ్ళీ హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఇక దీనికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు స్టార్ మా. ఇందులో రాహుల్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌లోకి హీరో మాదిరిగా అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో గొడుగు పట్టుకుని రీ-ఎంట్రీ ఇస్తున్నాడు.

అతడి వాయిస్ విని ఆనందంతో పొంగిపోయిన పునర్నవి.. రాహుల్ ఎదురుగా వచ్చేసరికి అతన్ని కౌగిలింతలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. అటు మిగిలిన కంటెస్టెంట్లు సైతం రాహుల్ రాకతో ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాహుల్‌ను ఎలిమినేట్ చేసినట్లు చేసి.. మళ్ళీ హౌస్‌లోకి తిరిగి తీసుకురావడానికి ఒకే ఒక్క కారణం పున్ను. ఈ ఇద్దరూ తమ మధ్య లవ్ ఎఫైర్ ఏమి లేదని చెబుతున్నా.. బిగ్ బాస్, నాగార్జునతో పాటుగా చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఎఫైర్ నడుస్తోందని అర్ధమైంది. ఎలిమినేషన్ ముందు వరకూ.. ‘నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటా రాహుల్’ అని మాత్రమే అన్న పునర్నవి.. ఫేక్ ఎలిమినేషన్‌తో తనలో రాహుల్‌పై దాగి ఉన్న కొండత ప్రేమను కన్నీటి రూపంలో చూపించిన సంగతి తెలిసిందే. ఇక రాహుల్ రీ-ఎంట్రీతో బిగ్ బాస్ వీళ్లిద్దరి మధ్య లవ్ స్టోరీని ముందుకు తీసుకెళ్లడం మాత్రం ఖాయంలా కనిపిస్తోంది.