ట్రాక్టర్‌ నడుపుతూ హల్చల్ చేసిన రాహుల్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బుధవారం పంజాబ్‌ రాష్ట్రంలోని లూథియానాలో పర్యటించారు. ప్రచారంలో భాగంగా ఆయన ట్రాక్టర్‌ను నడిపించారు. రైతులను ఉద్దేశించి వారికి భరోసాగా ఉంటాననే రాహుల్ ట్రాక్టర్ నడిపారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ట్రాక్టర్‌పై రాహుల్‌తోపాటు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్, లూథియానా ఎంపీ అభ్యర్థి రవ్‌నీత్ బిట్టు, కాంగ్రెస్ నేత ఆశా కుమార్ కొద్దిసేపు లూథియానా వీధుల్లో ప్రచారం చేశారు. రాహుల్ ట్రాక్టర్ నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *