Breaking News
  • నల్గొండను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. ప్రజలు మనపై పెట్టిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి-జగదీష్‌రెడ్డి. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం వేలకోట్ల నిధులు ఇస్తోంది. తొలిసారిగా ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యులను చేస్తున్నాం. నల్గొండ అభివృద్ధికి కొత్త పాలకవర్గం చిత్తశుద్ధితో పనిచేయాలి. అభివృద్ధిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పాత్ర కీలకం-మంత్రి జగదీష్‌రెడ్డి.
  • ఢిల్లీ అల్లర్ల ప్రాంతంలో ఇంటెలిజెన్స్‌ అధికారి మృతదేహం లభ్యం. ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ అంకిత్‌శర్మగా గుర్తింపు.
  • ఢిల్లీలో ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ. ఢిల్లీ ట్రాఫిక్‌ ఏసీపీగా ఎస్డీ మిశ్రా. ఢిల్లీ క్రైమ్‌ ఏసీపీగా ఎం.ఎస్‌.రాంధవా. రోహిణి డీసీపీగా ప్రమోద్‌ మిశ్రా. ఢిల్లీ సెంట్రల్‌ డీసీపీగా ఎస్‌.భాటియా. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ డీసీపీగా రాజీవ్‌ రంజన్‌ బదిలీ.
  • ప.గో: చింతలపూడి జెడ్పీ పాఠశాలలో లైంగిక వేధింపులు. మహిళా టీచర్‌ను లైంగికంగా వేధిస్తున్న తోటి టీచర్‌. డీఈవో, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసిన కలెక్టర్‌.
  • తిరుపతి: పలమనేరు అటవీప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల కేసు. 8 మందిపై కేసునమోదు, ఇప్పటికే పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు. నిందితులను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు ఏర్పాటు. కీలక నిందితుడు చెన్నైకి చెందిన స్వామీ జయచంద్రన్‌ కోసం గాలింపు. రుయాలో చికిత్సపొందుతున్న బాధితుడు గణేష్‌ పరిస్థితి విషమం. కాలిన గాయాలతో ఈ నెల 12న ఆస్పత్రిలో చేరిన గణేష్‌. గణేష్‌ను నరబలి ఇచ్చేందుకు యత్నించారంటున్న కుటుంబసభ్యులు. విద్యుత్‌షాక్‌తో గణేష్‌ ప్రమాదానికి గురయ్యాడంటున్న పోలీసులు.

మసూద్‌ని ‘జీ’ అని సంబోధించిన రాహుల్.. విరుచుకుపడుతున్న బీజేపీ

, మసూద్‌ని ‘జీ’ అని సంబోధించిన రాహుల్..  విరుచుకుపడుతున్న బీజేపీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి నోరుజారి చిక్కుల్లో పడ్డారు. బీజేపీ ఎప్పుడు రాహుల్ గాంధీ చిక్కుతారా అని వేచి చూస్తున్న తరుణంలో మరోసారి సెల్ఫ్ గోల్ కొట్టుకుని బీజేపీకి దొరికిపోయాడు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో రాహుల్ పాల్గొన్నారు. ఆ సమావేశంలో అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్ ను.. మసూద్‌ని ‘జీ’ అంటూ గౌరవంగా సంబోధించి చిక్కుల్లో పడ్డారు. రాహుల్ ఎప్పుడు చిక్కుతారా? అని చూసే బీజేపీకి ఇదో మంచి అస్త్రంలా మారింది. అంతర్జాతీయ ఉగ్రవాదిని ‘జీ’ అంటూ సంబోధించడమేంటని బీజేపీ ఏకి పారేస్తోంది.
దీనిలో భాగంగా కాందహార్ ఘటనను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మసూద్ ‘జీ’ని అప్పటి ఎన్డీయే ప్రభుత్వమే విడిచిపెట్టిందని.. ఇప్పటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అప్పట్లో స్వయంగా కాందహార్ వెళ్లి మరీ అప్పగించారని తెలిపారు. దీంతో బీజేపీ.. రాహుల్‌కూ, పాక్‌కూ ఉగ్రవాదులంటే అమితమైన ప్రేమ అని అంతర్జాతీయ టెర్రరిస్టును ‘జీ’ అంటూ సంబోదిస్తారా? అంటూ విరుచుకుపడింది. టెర్రరిస్టులను గౌరవించడమంటే పరోక్షంగా పుల్వామా అమరవీరులను అవమానించడమేనంటూ స్మృతి ఇరానీ.. రాహుల్‌ని విమర్శించారు.

Related Tags