ఎన్నికల ప్రచారానికి ఆయన రానట్టేనా? .. బ్యాంకాక్ టూర్‌లో రాహుల్

రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరగున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ చీఫ్ రాహుల్‌గాంధీ బ్యాంకాక్‌ ట్రిప్‌‌కు వెళ్లారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాలు చేయాల్సిన సమయంలో రాహుల్ బ్యాంకాక్‌ టూర్‌కి వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రణాళికా బద్దంగా అడుగులు వేస్తోంది. ఇంత రాజకీయ వేడి రగులుతున్న సమయంలో రాహుల్ […]

ఎన్నికల ప్రచారానికి ఆయన రానట్టేనా? .. బ్యాంకాక్ టూర్‌లో రాహుల్
Follow us

| Edited By:

Updated on: Oct 06, 2019 | 6:58 PM

రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరగున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ చీఫ్ రాహుల్‌గాంధీ బ్యాంకాక్‌ ట్రిప్‌‌కు వెళ్లారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాలు చేయాల్సిన సమయంలో రాహుల్ బ్యాంకాక్‌ టూర్‌కి వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రణాళికా బద్దంగా అడుగులు వేస్తోంది. ఇంత రాజకీయ వేడి రగులుతున్న సమయంలో రాహుల్ బ్యాంకాక్ టూర్‌కు వెళ్లడం ఏమిటని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Rahul gandhi will campaign for haryana maharashtra polls after bangkok trip

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత తీవ్ర నిరాశకు లోనైన రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తనకు బదులు కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. చివరికి సోనియా గాంధీనే పార్టీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఈ నెలలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలను కాంగ్రెస్ ఇంకా ప్రారంభించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. హఠాత్తుగా రాహుల్‌ బ్యాంకాక్ వెళ్లడంపై వెనుక ఏం జరిగి ఉంటుందనే విషయంలో మాత్రం ఒక వార్త హల్‌చల్‌ చేస్తోంది. త్వరలో జరగనున్న హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి రాహుల్‌ను తప్పించారనే ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే గతంలో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే ఆయన బ్యాంకాక్‌ వెళ్లారని, నాలుగైదు రోజుల తర్వాత మళ్లీ తిరిగివస్తారని, ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ నేతలు పేర్కొన్నారు. హర్యానా తరువాత మహారాష్ట్రలో రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారని సీనియర్లు స్పష్టం చేశారు.