ఈనెల 23 నుంచి రాహుల్ బీహార్ ప్రచారం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉపందుకుంది, అధికార, విపక్షాలు పోటా పోటీ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.

ఈనెల 23 నుంచి రాహుల్ బీహార్ ప్రచారం
Follow us

|

Updated on: Oct 17, 2020 | 5:03 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉపందుకుంది, అధికార, విపక్షాలు పోటా పోటీ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. అధికార ఎన్డీఏ కూటమి ప్రధాని మోదీతో సహా ముఖ్యనేతలందరూ ఎన్నికల క్యాంపెన్ కు రెఢీ అవుతుండగా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీతో సహా అందరూ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారాన్ని ఈనెల 23న ప్రారంభించనున్నారు. అదే రోజు రెండు ర్యాలీల్లో ఆయన పాల్గొంటారు. ఇందులో భాగంగా తొలుత హిసువలోని ర్యాలీలో కాంగ్రెస్ అభ్యర్థి నీతూ సింగ్ ‌తరఫున రాహుల్ ప్రచారం చేస్తారు.

ప్రధానంగా భూమిహార్ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భూమిహార్ కమ్యూనిటీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. చాలా కాలం తర్వాత పార్టీకి ఈ స్థాయిలో సీట్లు రావడం ఇదే మొదటిసారి కూడా. భూమిహార్ కులస్థులకు పార్టీ సందేశాన్ని అందజేసేందుకు వీలుగా కహల్‌గావ్‌లో మరో ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. సీఎల్‌పీ నేత సదానంద్ సింగ్ కుమారుడు ముఖేష్ సింగ్ ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు, 9 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన సదానంద్ సింగ్ ఈసారి తన కుమారుడు ముఖేష్ కోసం ఈ సీటును ఖాళీ చేశారు. ముఖేష్ సింగ్ విజయావకాశాలను మెరుగుపరచేందుకు రాహుల్ ప్రచారం సాగిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

పార్టీ వర్గాల సమచారం ప్రకారం, తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ సంయుక్తంగా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అయితే కూటమి పార్టీల సంయుక్త ప్రచారానికి సంబంధించిన తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. బీహార్ ఎన్నికల్లో ప్రతి ఫేజ్‌కు రెండు ర్యాలీల చొప్పున మొత్తం 6 ర్యాలీల్లో రాహుల్ పాల్గొంటారి సమాచారం. కాగా, 23వ తేదీనే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాన్ని మొదలు కానుంది. మొత్తం మూడు విడతల్లో 12 ఎన్నికల ర్యాలీల్లో మోదీ పాల్గొంటారు. ఈనెల 28న తొలి విడత పోలింగ్ జరుగనుంది.