ధోని, జడేజాల ఆటతీరు ప్రశంసనీయం… రాహుల్ స్పందన!

Dhoni Jadeja Rahul Gandhi, ధోని, జడేజాల ఆటతీరు ప్రశంసనీయం… రాహుల్ స్పందన!

ఢిల్లీ: ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన  టీమిండియాకు రాహుల్ గాంధీ మద్దతు పలికారు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. ఈ ఓటమి కోట్లాది మంది భారతీయులకు నిరాశ మిగిల్చినా.. టీమిండియా మాత్రం అద్భుతంగా పోరాడిందని రాహుల్ మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఎం.ఎస్.ధోని, రవీంద్ర జడేజా ఆటతీరు ప్రశంసనీయం అని కొనియాడారు. భారత్ ఆటగాళ్ల పోరాటపటిమకు అభిమానుల ప్రేమ, గౌరవం దక్కించుకున్నారని రాహుల్ తెలిపారు.

అలాగే ఫైనల్స్‌ చేరిన న్యూజిలాండ్‌ జట్టుకు కూడా రాహుల్‌ అభినందనలు చెప్పారు. ఇది ఇలా ఉండగా కోహ్లీసేనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రముఖులందరూ ప్రశంసలు కురిపించారు. టోర్నీ అంతటా కోహ్లీసేన ప్రదర్శన అద్భుతంగా ఉందని.. గెలుపోటములు జీవితంలో సహజమేనని మోదీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *