మళ్ళీ హత్రాస్ జిల్లాకు వెళ్తా, రాహుల్ గాంధీ

యూపీలోని హత్రాస్ జిల్లాకు తాను మళ్ళీ వెళ్తానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.  ఈ జిల్లాలో దారుణ హత్యాచారానికి గురైన యువతి కుటుంబాన్ని  పరామర్శిస్తానని ఆయన చెప్పారు.

  • Umakanth Rao
  • Publish Date - 12:33 pm, Sat, 3 October 20

యూపీలోని హత్రాస్ జిల్లాకు తాను మళ్ళీ వెళ్తానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.  ఈ జిల్లాలో దారుణ హత్యాచారానికి గురైన యువతి కుటుంబాన్ని  పరామర్శిస్తానని ఆయన చెప్పారు. అక్కడికి వెళ్లకుండా ఈ ప్రపంచంలో తనను ఎవరూ ఆపలేరన్నారు. ఈ నెల 1 న హత్రాస్ కు వెళ్తున్న రాహుల్, ప్రియాంక గాంధీ తదితరులను నోయిడా బోర్డర్ లోనే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం, తోపులాటల్లో రాహుల్ కింద పడిపోవడం తెలిసిందే.  కాంగ్రెస్ నేతలను కొన్ని గంటలు నిర్బంధంలో ఉంచిన అనంతరం వారిని తిరిగి ఢిల్లీకి పంపివేశారు.

రెండు రోజులపాటు సీల్ చేసిన హత్రాస్ సరిహద్దులను శనివారం మళ్ళీ తెరుస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ జిల్లాలో ప్రవేశించేందుకు రిపోర్టర్లను మాత్రమే అనుమతిస్తున్నామని, కానీ రాజకీయనాయకులకు అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. దీంతో  రాహుల్ విజిట్ సమయంలో మళ్ళీ ఇక్కడ గురువారం నాటి ఘటనలు పునరావృతం కావచ్చునని భావిస్తున్నారు.