Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 6 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు.
  • తమిళనాడు: నిత్యానందపై కిడ్నాప్‌ కేసు నమోదు. ఇద్దరు అమ్మాయిలను కిడ్నాప్‌ చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌. నిత్యానంద ఇద్దరు శిష్యుల అరెస్ట్‌.
  • సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటన. షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదు. ఎలాంటి షరతులపై సంతకాలు పెట్టేదిలేదన్న ఆర్టీసీ జేఏసీ.
  • సమ్మె పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న ప్రభుత్వం. షరతులు లేకుండా ఉద్యోగాల్లోకి తీసుకునే.. అవకాశం లేదంటున్న ప్రభుత్వ వర్గాలు. నేడు నిర్ణయం తీసుకునే అవకాశం.
  • అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాల రద్దు వద్దు. ఒప్పందాల రద్దుపై ప్రత్యేక నిబంధన రూపొందించాలి. 15వ ఆర్థిక సంఘానికి విదేశీ వ్యవహారాల శాఖ లేఖ.
  • నల్లమలలో యురేనియం తవ్వకాలకు అనుమతించలేదు. లోక్‌సభలో ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు ప్రశ్నకు.. కేంద్ర అణు ఇంధనశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ సమాధానం.
  • శ్రీలంక ప్రధానిగా మహీంద్ర రాజపక్స. మహీంద్రను ప్రధానిగా ప్రకటించిన అధ్యక్షుడు గోటబాయ రాజపక్స. నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్న మహీంద్ర రాజపక్స.
  • ఒడిశా: పృథ్వి-2 క్షిపణి విజయవంతం. విజయవంతంగా క్షిపణిని పరీక్షించిన సైనిక బలగాలు. అణ్వాయుధ సామర్థ్యంతో దేశీయంగా అభివృద్ధి చేసిన పృథ్వి-2.

రెస్టారెంట్ సిబ్బందితో సెల్ఫీలే… సెల్ఫీలు !

, రెస్టారెంట్ సిబ్బందితో సెల్ఫీలే…  సెల్ఫీలు !

ఓ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. అహ్మదాబాద్ (గుజరాత్) మెట్రోపాలిటన్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఈ నగరంలోని ఓ రెస్టారెంటుకు వెళ్లి.. అక్కడ నిర్వాహకులతోను, సిబ్బందితోను కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. ఇదే సమయమనుకుని వారు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇటీవల అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ అజయ్ పటేల్ రాహుల్ పై పరువునష్టం దావా వేశారు. నోట్ల రద్దు సమయంలో అహ్మదాబాద్ కో-ఆపరేటివ్ బ్యాంకు 745 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడిందని రాహుల్ తో బాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆ మధ్య ఆరోపించారు. దాంతో వీరిపై అజయ్ పటేల్ అహ్మదాబాద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

, రెస్టారెంట్ సిబ్బందితో సెల్ఫీలే…  సెల్ఫీలు !