ఈ పదవి వద్దంటే వద్దు..తప్పుకుంటా !

కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయంలో మార్పు లేదని అన్నారు రాహుల్ గాంధీ.. ఈ నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తి లేదని, పైగా పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపికలో తన ప్రమేయం ఉండదని ఆయన గురువారం స్పష్టం చేశారు. పార్టీ వ్యవస్థలో జవాబుదారీతనం అంటూ ఉండాలన్నారు. నేను కొత్త చీఫ్ ఎంపికలో జోక్యం చేసుకున్న పక్షంలో పరిస్థితి జటిలం కావచ్ఛు అని రాహుల్ పేర్కొన్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యానికి పూర్తి […]

ఈ పదవి వద్దంటే వద్దు..తప్పుకుంటా !
Follow us

|

Updated on: Jun 20, 2019 | 3:05 PM

కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయంలో మార్పు లేదని అన్నారు రాహుల్ గాంధీ.. ఈ నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తి లేదని, పైగా పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపికలో తన ప్రమేయం ఉండదని ఆయన గురువారం స్పష్టం చేశారు. పార్టీ వ్యవస్థలో జవాబుదారీతనం అంటూ ఉండాలన్నారు. నేను కొత్త చీఫ్ ఎంపికలో జోక్యం చేసుకున్న పక్షంలో పరిస్థితి జటిలం కావచ్ఛు అని రాహుల్ పేర్కొన్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యానికి పూర్తి బాధ్యత వహిస్తూ రాహుల్ గతంలోనే పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఆయన ఇదే ప్రకటన చేశారు. అయితే సీనియర్ నేతలు ఇందుకు అంగీకరించలేదు. వర్కింగ్ కమిటీ రెండు సార్లు సమావేశమైనప్పటికీ రాహుల్ తన నిర్ణయంలో మార్పు ఉండబోదని చెబుతూ వచ్చారు. . అయితే కాల క్రమంలో ఆయన ధోరణి మారవచ్ఛునని, తిరిగి పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతారని ఆశిస్తూ వచ్చిన పార్టీ నాయకులకు ఆయన తాజా నిర్ణయంతో ఆశాభంగమైంది. నూతన సారథిని ఎన్నుకోవలసిందే అంటూ రాహుల్ పరోక్షంగా ప్రకటించడంతో ఇక ఆ కసరత్తుకు రంగం సిధ్ధమవుతుందని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షపదవిపై పలువురు సీనియర్ నేతలు కన్ను వేసినప్పటికీ.. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా రాకపోవడంతో వారు అయోమయంలో పడ్డారు. తన కుమారుడి రాజీనామా విషయంలో ఆమె స్పందన నేటివరకూ తెలియలేదు. రాహుల్ పార్టీ చీఫ్ పదవిలో కొనసాగుతారా లేక కొత్త అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమం చేస్తారా అన్నదానిపై సోనియా నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. కొన్ని రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకైనా పార్టీని పటిష్ఠపరచి రాహుల్ ముందుండి నడిపించాలని ద్వితీయ శ్రేణి నాయకులు కోరుతున్నప్పటికీ.. ఆయన నిర్ణయం వారిని కలవరపరుస్తోంది. శశిథరూర్, పి. చిదంబరం వంటి నేతలు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. పైకి రాహుల్ నిర్ణయాన్ని వారు తిరస్కరిస్తున్నా… లోలోన పార్టీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అవసరమైతే పార్టీ పగ్గాలు తమను వరించవచ్ఛేమో అన్న ఆశలు వారిలో లేకపోలేదని ఢిల్లీ మీడియా అన్యాపదేశంగా పేర్కొంటోంది.

భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి..
భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి..
కావ్యా పాపతో ఉన్న ఈ క్యూటీ ఆ స్టార్ క్రికెటర్ చెల్లినా?
కావ్యా పాపతో ఉన్న ఈ క్యూటీ ఆ స్టార్ క్రికెటర్ చెల్లినా?
లోక్‌సభ ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి ఆరుగురు మహిళలు
లోక్‌సభ ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి ఆరుగురు మహిళలు
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా