నేను చెప్పిందే రిజర్వ్ బ్యాంక్ ధృవీకరించింది, రాహుల్ గాంధీ

దేశ ఆర్ధిక పరిస్థితి క్షీణిస్తోందని తాను ఎన్నోసార్లు చెప్పిందే రిజర్వ్ బ్యాం కు కూడా ధృవీకరించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అయితే మీడియా ద్వారా పక్కదారి పట్టించే యత్నాలు పేదలకు మేలు చేయవన్నారు.

నేను చెప్పిందే రిజర్వ్ బ్యాంక్ ధృవీకరించింది, రాహుల్ గాంధీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 26, 2020 | 11:59 AM

దేశ ఆర్ధిక పరిస్థితి క్షీణిస్తోందని తాను ఎన్నోసార్లు చెప్పిందే రిజర్వ్ బ్యాం కు కూడా ధృవీకరించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అయితే మీడియా ద్వారా పక్కదారి పట్టించే యత్నాలు పేదలకు మేలు చేయవన్నారు. కరోనా వైరస్ పాండమిక్ కారణంగా దేశ ఎకానమీ డోలాయమానంగా ఉందని ఆర్ బీ ఐ నిన్న తన వార్షిక  డాక్యుమెంట్ లో తెలిపింది. ఈ పరిస్థితి సెప్టెంబరు వరకు కొనసాగుతుందని హెచ్చరించింది. కరోనా కారణంగా ఈ సీజన్ లో వర్షపాతంలో హెచ్ఛు తగ్గులు ఏర్పడ్డాయని, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోందని, పైగా ఈ పాండమిక్ ప్రభావం 200 దేశాల్లో తీవ్రంగా ఉందని ఆ డాక్యుమెంట్ పేర్కొంది.

దీన్ని రాహుల్ గాంధీ హైలైట్ చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులు ఇవ్వకుండా ఆ సొమ్మును పేదలకు పంచాలని, తాము ఎన్నుకున్న ప్రభుత్వం పట్ల విశ్వాసం చూపుతున్న ప్రజల కొనుగోలు శక్తి పెరిగేలా చూడాలని ట్వీట్ చేశారు.