మోదీతో ఏదైనా సాధ్యమే అంటూ రాహుల్‌ సెటైర్‌!

ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ సారి ఆర్థిక వ్యవస్థనపై ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ విరుచుకుపడ్డారు. మోదీ ఉన్నారుగా ఏదైనా సాధ్యమే అంటూ సెటైర్‌ వేశారు.

మోదీతో ఏదైనా సాధ్యమే అంటూ రాహుల్‌ సెటైర్‌!
Follow us

|

Updated on: Aug 12, 2020 | 4:48 PM

ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ సారి ఆర్థిక వ్యవస్థనపై ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ విరుచుకుపడ్డారు. మోదీ ఉన్నారుగా ఏదైనా సాధ్యమే అంటూ సెటైర్‌ వేశారు. దేశ వృద్ధిరేటు స్వాతంత్య్రం వచ్చాక అత్యంత కనిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని నారాయణ మూర్తి హెచ్చరించారు. భారత వృద్ధి కనీసం 5 శాతం క్షీణించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన న్యూస్‌క్లిప్పింగ్‌ను జోడిస్తూ.. ‘మోదీ ఉన్నారుగా ఏదైనా సాధ్యమే’ అంటూ రాహుల్‌ బుధవారం ట్వీట్ చేశారు. 2019 ఎన్నికల సమయంలో ఇదే నినాదాన్ని భారతీయ జనతా పార్టీ వాడుకుందన్నారు. ఆ నినాదాన్ని రాహుల్‌ ఈ విధంగా ఉపయోగించారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని రాహుల్‌ గతంలోనూ ప్రభుత్వానికి సూచించారు.