ఇలాంటి నేత ఉండటం దురదృష్టకరం : స్మృతి ఇరానీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వంటి నేత మనకు ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆయన పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని, రాహుల్‌కు భారత్ కంటే పాక్ అంటేనే ఎక్కువ ప్రేమ ఉందని విమర్శించారు. ఆయన పాకిస్తాన్‌కు మద్దతు తెలుపటం మొదటిసారి కాదని గతంలోకూడా చాల ఉదాహరణలు ఉన్నాయంటూ స్మృతి మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ సకల ప్రయత్నాలు చేస్తోంది. ఈ […]

ఇలాంటి నేత ఉండటం దురదృష్టకరం : స్మృతి ఇరానీ
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2019 | 8:17 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వంటి నేత మనకు ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆయన పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని, రాహుల్‌కు భారత్ కంటే పాక్ అంటేనే ఎక్కువ ప్రేమ ఉందని విమర్శించారు. ఆయన పాకిస్తాన్‌కు మద్దతు తెలుపటం మొదటిసారి కాదని గతంలోకూడా చాల ఉదాహరణలు ఉన్నాయంటూ స్మృతి మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ సకల ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితికి లేఖలు కూడా రాసింది. ఈ లేఖలో రాహుల్ పేరు ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో స్మృతి రాహుల్‌పై ఇలా వ్యాఖ్యానించారు.