పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్!

అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ ముంజూరైంది. ఈ కేసును విచారణ సందర్భంగా రాహుల్ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. 15,000 పూచీకత్తుపై రాహుల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరు కావడం గమనార్హం. మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు చేపట్టిన‌ అయిదు రోజుల తర్వాత అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకులో 745.59 కోట్ల […]

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్!
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2019 | 7:35 PM

అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ ముంజూరైంది. ఈ కేసును విచారణ సందర్భంగా రాహుల్ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. 15,000 పూచీకత్తుపై రాహుల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరు కావడం గమనార్హం.

మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు చేపట్టిన‌ అయిదు రోజుల తర్వాత అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకులో 745.59 కోట్ల నల్ల ధనాన్ని అసలైన నోట్లుగా మార్చుకున్నారని అమిత్‌షా, ఆ బ్యాంకు డైరెక్టర్‌ను ఉద్దేశిస్తూ రాహుల్ ట్వీట్ చేయడంతో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు నమోదైంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లభ్యం కావడంతో ఏప్రిల్ 9 తేదీన కోర్టు సమన్లు జారీ చేసింది. తమ బ్యాంకుపై రాహుల్ తప్పుడు ఆరోపణలు చేసి తమ ప్రతిష్ఠకు భంగం కలిగించారని అహ్మదాబాదు జిల్లా సహకార బ్యాంకు తన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు తన సైద్ధాంతిక పోరాటం ముందుకెళ్లడానికి సహాయపడుతున్న ఆరెస్సెస్, బీజేపీకి రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం తాను అహ్మదాబాదులో ఉన్నానని, రేపు మరో కేసులో మరో ప్రదేశంలో ఉంటానని అన్నారు. ‘సత్యమేవ జయతే’ అని రాహుల్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..