కమల్ నాథ్ కామెంట్ దురదృష్టకరం, రాహుల్ గాంధీ

మధ్యప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ‘ఐటమ్’ గా అభివర్ణిస్తూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఖండించారు. కమల్ నాథ్ తమ పార్టీవాడేనని, కానీ ఏ పార్టీకి చెందినా ఈ విధమైన భాషను  వాడడాన్ని తాను అంగీకరించబోనని ఆయన ట్వీట్ చేశారు. ఇది దురదృష్టకరం అన్నారు. మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో ఇమ్రతీ దేవి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దాబ్రాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో […]

కమల్ నాథ్ కామెంట్ దురదృష్టకరం, రాహుల్ గాంధీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 20, 2020 | 4:05 PM

మధ్యప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ‘ఐటమ్’ గా అభివర్ణిస్తూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఖండించారు. కమల్ నాథ్ తమ పార్టీవాడేనని, కానీ ఏ పార్టీకి చెందినా ఈ విధమైన భాషను  వాడడాన్ని తాను అంగీకరించబోనని ఆయన ట్వీట్ చేశారు. ఇది దురదృష్టకరం అన్నారు. మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో ఇమ్రతీ దేవి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దాబ్రాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కమల్ నాథ్.. ఆమెను ఉద్దేశించి ‘ ఐటెమ్’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనిపై పెద్దఎత్తున దుమారం రేగగా, ఇందుకు చింతిస్తున్నానని, ఎవరినీ అవమానపరచాలన్న ఉద్దేశం తనకు లేదని  ఆ తరువాత స్పష్టం చేశారు.

నిజానికి ఇమ్రతీ దేవి లోగడ కమల్ నాథ్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. అయితే జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వాన కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఆమె ఒకరు.