తీహార్‌ జైలుకు రాహుల్‌, ప్రియాంక..ఎందుకంటే

తీహార్‌ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కలిశారు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక. మనీలాండరింగ్‌ కేసులో ఆయనకున్నజ్యుడీషియల్‌ రిమాండ్‌ గడువు నేటితో ముగియనుంది. ఈ కేసులో ఆయన బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విచారించనుంది ఉన్నత న్యాయస్థానం. నవంబర్‌ 15న ఢిల్లీ హైకోర్ట్‌ బెయిల్‌ నిరాకరించడంతో దాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు చిదంబరం. ఈ  పిటిషన్‌పై ఇవాళ వాదనలు వినిపించనున్నారు ఇరు వర్గాల లాయర్లు. షెల్‌ కంపెనీలు, విదేశీ ఖాతాలను సృష్టించి అక్రమాలకు […]

తీహార్‌ జైలుకు రాహుల్‌, ప్రియాంక..ఎందుకంటే
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 27, 2019 | 6:31 PM

తీహార్‌ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కలిశారు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక. మనీలాండరింగ్‌ కేసులో ఆయనకున్నజ్యుడీషియల్‌ రిమాండ్‌ గడువు నేటితో ముగియనుంది. ఈ కేసులో ఆయన బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విచారించనుంది ఉన్నత న్యాయస్థానం. నవంబర్‌ 15న ఢిల్లీ హైకోర్ట్‌ బెయిల్‌ నిరాకరించడంతో దాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు చిదంబరం. ఈ  పిటిషన్‌పై ఇవాళ వాదనలు వినిపించనున్నారు ఇరు వర్గాల లాయర్లు. షెల్‌ కంపెనీలు, విదేశీ ఖాతాలను సృష్టించి అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తోంది ఈడీ. మాజీ కేంద్రమంత్రిగా ఉన్న చిదంబరం చాలా తెలివైన వ్యక్తి అని..ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని పేర్కొంది. ఈ కేసులో అక్టోబర్ 16న చిదంబరాన్ని అదుపులోకి తీసుకుంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ఇక ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐ ఆగస్ట్‌ 21న అరెస్ట్‌ చేయగా..అక్టోబర్‌ 22న బెయిల్‌ మంజూరు చేసింది సుప్రీంకోర్ట్‌. మరోవైపు నిన్న కాంగ్రెస్ నాయకులు శశి థరూర్, మనీష్ తివారీ కూడా జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రిని కలిసి తమ సంఘీభావం తెలిపారు.

బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..