ఎన్‌సీఏ క్రికెట్ హెడ్ పదవికి ద్రావిడ్‌కు లైన్ క్లియర్

Rahul Dravid

ముంబయి:  టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) క్రికెట్‌ హెడ్‌ బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమమైంది. ఎన్‌సీఏ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ద్రవిడ్‌కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ద్రవిడ్‌పై ఉన్న పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసును క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ) క్లియర్ చేసింది. ఈ కేసులో విరుద్ధ ప్రయోజనాల అంశాలేమీ లేవంటూ తేల్చిచెప్పింది. ఈ మేరకు సీవోఏ కొత్త సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ రవి తొగ్డె పలు విషయాలు వెల్లడించారు. ద్రవిడ్ నియామకం విషయంలో తమకు వివాదమేదీ కనిపించలేదని పేర్కొన్న రవి.. ఈ విషయంలో అంబుడ్స్‌మన్ ఏదైనా గుర్తిస్తే అప్పుడు మాట్లాడతామని అన్నారు.

అయితే బంతి బీసీసీఐ అంబుడ్స్‌మన్ కమ్ ఎథిక్స్ అధికారి డీకే జైన్ కోర్టులో ఉందని రవి తొగ్డె పేర్కొన్నారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని అయిన శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌లోనూ ద్రవిడ్ ఉపాధ్యక్షుడిగా ఉండడంతో వివాదం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *