Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

ఢిల్లీలో 300మంది ఎంపీలకు తెలుగోడి విందు.. అసలు కథేంటి..?

Raghuram Krishnam Gives Clarity On Arranging party for political celebrities, ఢిల్లీలో 300మంది ఎంపీలకు తెలుగోడి విందు.. అసలు కథేంటి..?

రాజుగారు హౌ ఆర్‌ యూ..? అన్న ప్రధాని పిలుపుతో.. ఆ ఎంపీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీ.. వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును.. పేరు పెట్టి రాజుగారూ హౌ ఆర్ యూ అంటూ పలకరించారు. అయితే ప్రధాని ఆ  పిలుపుతో.. ఎంపీగారి జోరు.. ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిపోయింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఇంటి నుంచి మొదలుపెడితే.. సౌత్ బ్లాక్ దాకా ఎక్కడ చూసినా ఈ ఎంపీ హవానే.. అయితే తాజాగా మళ్లీ మరో వార్తతో వార్తల్లోకెక్కాడు. దాదాపు మూడు వేల మంది వీఐపీలకు ఢిల్లీలో విందు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డిన్నర్‌కి ప్రముఖ రాజకీయ నాయకులతో పాటుగా.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తదితరులు హాజరుకానున్నట్లు.. సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఈ విందు వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మూడువేల మంది వీఐపీలకు డిన్నర్ ఇస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాతో పాటు.. పలు మీడియాల్లో కూడా ప్రత్యేక కథనాలు రావడంతో.. ఎట్టకేలకు ఆయన దీనిపై స్పందించారు. మూడు వేల మంది అనేది వట్టి పుకార్లేనంటూ కొట్టిపారేశారు. బుధవారం రోజు రాత్రి.. 300మంది ఎంపీలకు విందు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ డిన్నర్‌కు ప్రధాని మోదీ, అమిత్ షా, స్పీకర్‌లను సెక్యూరిటీకి ఇబ్బందిగా అవుతుందని వారిని ఆహ్వానించలేదని క్లారిటీ ఇచ్చారు.

Raghuram Krishnam Gives Clarity On Arranging party for political celebrities, ఢిల్లీలో 300మంది ఎంపీలకు తెలుగోడి విందు.. అసలు కథేంటి..?

అయితే.. ఈ విందుకు భారీ మెనుతో రఘురామకృష్ణంరాజు అరేంజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డిన్నర్‌లో ప్రత్యేకంగా ఆంధ్ర వంటకాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాజుగారు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ విందులో ఇచ్చే కిళ్లీపై అనేక వార్తలు వస్తున్నాయి. ఒక్కో కిళ్లీ ధర.. రూ.1000/- ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఒక్క కిళ్లీకే ఇంత ఖర్చు పెడుతున్నారంటే.. మిగతా వంటకాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించుకోవచ్చంటు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇంత రేంజ్‌లో అసలు రాజుగారు డిన్నర్ ఎందుకు ఇస్తున్నారన్న దానిపై భిన్న రకాల రాజకీయ స్వరాలు వినిపిస్తున్నాయి. తొలిసారి ఎంపీగా గెలిచిన ఈయన.. సీఎం జగన్ మాట వినకుండానే పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు గుసగుసలు మొదలయ్యాయట. ఇక ఇలా దూకుడుగా వెళ్లడానికి అసలు రీజన్.. ఆయన వియ్యంకుడు కేవీపీ అండగా ఉండటమేనంటూ మరిన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరికొందరైతే.. ఈ మధ్య తరచూ బీజేపీ నేతలతో టచ్ ఉంటున్నారని.. ఇక కమలం గూటికి వెళ్లడం ఖాయమన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అందుకే సీఎం జగన్‌ బీజేపీ నేత గోకరాజు గంగారాజు కుటుంబ సభ్యులను వైసీపీలో చేర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ రాజుగారి డిన్నర్.. ఎమైనా రాజకీయ దుమారానికి తెరతీస్తుందో వేచి చూడాలి.