ఒంటరైన రఘురామకృష్ణంరాజు.. జగన్ వెలేశారా?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును వైసీపీ అంతర్గతంగా వెలివేసిందా? పరిణామాలు, పరిస్థితులు చూస్తుంటే నిజమే అంటున్నాయి వైసీపీ వర్గాలు. దీనికి గత కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు. వైసీపీ తరపున గెలిచి.. ఇటీవల కాలంలో బీజేపీ అధినాయకత్వానికి బాగా టచ్‌లో వుంటున్న రఘురామకృష్ణంరాజును అనధికారికంగా వెలి వేసిన సంగతి అటూ ఇటూగా ఢిల్లీ దాకా చేరడంతో ఇది నిజమేనని అనుకోవాల్సి వస్తుందంటున్నారు. రఘురామకృష్ణంరాజు.. బీజేపీ వయా టీడీపీ వయా […]

ఒంటరైన రఘురామకృష్ణంరాజు.. జగన్ వెలేశారా?
Follow us

| Edited By: Srinu

Updated on: Feb 08, 2020 | 4:10 PM

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును వైసీపీ అంతర్గతంగా వెలివేసిందా? పరిణామాలు, పరిస్థితులు చూస్తుంటే నిజమే అంటున్నాయి వైసీపీ వర్గాలు. దీనికి గత కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు. వైసీపీ తరపున గెలిచి.. ఇటీవల కాలంలో బీజేపీ అధినాయకత్వానికి బాగా టచ్‌లో వుంటున్న రఘురామకృష్ణంరాజును అనధికారికంగా వెలి వేసిన సంగతి అటూ ఇటూగా ఢిల్లీ దాకా చేరడంతో ఇది నిజమేనని అనుకోవాల్సి వస్తుందంటున్నారు.

రఘురామకృష్ణంరాజు.. బీజేపీ వయా టీడీపీ వయా వైసీపీ వయా… అలా అన్ని పార్టీల్లోను ఎంతో కొంత కాలం కొనసాగి.. ఏ పార్టీలోను సీరియస్‌గా ఇమడని నేత. ప్రస్తుతం నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, గెలిచింది వైసీపీ తరపునే అయినా.. ఆయన ఢిల్లీలో బీజేపీ ఎంపీలాగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. తరచూ బీజేపీ అధినేతలను కల్వడం.. నార్త్ బ్లాక్‌లోని కేంద్ర కేబినెట్ మంత్రుల్లో కీలక శాఖల్లో తరచూ కనిపించడం రఘురామకృష్ణంరాజుకు రివాజు అని అంటూ వుంటారు.

శుక్రవారం పార్లమెంటు ఆవరణలో ముగ్గురు వైసీపీ ఎంపీల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఇదంతా సమీపంలోనే వున్న మీడియా ప్రతినిధులు ప్రత్యక్షంగా కనీ, విన్నదే. విశాఖపట్నంలోని వాల్తేరు క్లబ్ విషయంలో నెలకొన్ని వివాదంపై ముగ్గురు ఎంపీలు మాట్లాడుకుంటున్న తరుణంలో రఘురామకృష్ణంరాజు ఒక్కసారిగా రెచ్చిపోయినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పుకుంటున్నారు. వాల్తేర్ క్లబ్‌లో తాను సభ్యుడినేనని, క్లబ్ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా తాను ఊరుకోనని ఆల్ మోస్ట్ సవాల్ చేస్తున్న ధోరణిలో రఘురామకృష్ణంరాజు మాట్లాడారని చెబుతున్నారు. మరి ఇది టీడీపీ అధినేతకు వార్నింగా ? లేక సొంత పార్టీ అధినేతకు హెచ్చరికా అన్నది ఇదమిత్తంగా తేలనప్పటికీ..ఆయన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి.

మరోవైపు గత కొంతకాలంగా రఘురామకృష్ణంరాజు ధోరణి నచ్చని వైసీపీ అధినాయకత్వం ఆయన్ను పార్టీ ప్రతినిధిగా భావించవద్దని, ఆయన ఏం మాట్లాడినా ఆయన వ్యక్తిగతంగానే భావించాలని, పార్టీ అభిప్రాయంగా చూడవద్దని ఢిల్లీలోని మీడియా ప్రతినిధులకు వైసీపీ సంకేతాలు పంపడం కూడా చర్చనీయాంశమైంది. అదే సమయంలో రఘురామకృష్ణంరాజు నివాసముండే భీమవరంలోను ఆయన ఇంటి వైపు వైసీపీ వర్గాలు కన్నెత్తి చూడడం లేదని తెలుస్తోంది. ఆయన నివాసముండే వీథిలోనే ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు నివాసం వద్దనే ఎక్కువ మంది వైసీపీ వర్గాలు కనిపిస్తున్నాయని సమాచారం. గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజు ప్రస్తుతం నర్సాపురం లోక్‌సభ స్థానానికి అనధికారిక ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే రఘురామకృష్ణంరాజు వైసీపీలో ఒంటరిగా మారారని అనుకోవాలి. అందుకు ఆయన బీజేపీతో సన్నిహితంగా మెదలడమే కారణమని అంటున్నారు. రఘురామకృష్ణంరాజు బీజేపీకి సన్నిహితంగా మారక ముందు విజయసాయి రెడ్డి తరచూ బీజేపీ అధినేతలను కలిసే వారట. ఈయన కల్వడం మొదలయ్యాక బీజేపీ నేతలు విజయసాయిరెడ్డికి పెద్దగా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదట. దాంతో ఆయనే పరిస్థితిని వైసీపీ అధినేత జగన్‌కు వివరించినందు వల్లనే రఘురామకృష్ణంరాజు పార్టీలో ఒంటరిగా, ఇంకా చెప్పాలంటే అంటరాని నేతగా మారారని అనుకుంటున్నారు.