బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ గవర్నర్‌ రేస్‌లో రాజన్?

Raghuram Rajan A Contender For Huge UK Position, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ గవర్నర్‌ రేస్‌లో రాజన్?

లండన్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా మాజీ గవర్నర్‌, ప్రముఖ ఆర్థిక వేత్త రఘురామ్‌ రాజన్‌ యూకేలో కీలక పదవికి పోటీ పడుతున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గవర్నర్‌ పదవికి పోటీ పడుతున్న టాప్‌ వ్యక్తుల్లో ఒకరిగా ఆయన ఉన్నారని ఇంగ్లాండ్ మీడియా వెల్లడించింది.  2013 నుంచి 2016 మధ్య ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌  గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అధినేతగా కూడా పనిచేశారు.. అనంతరం ఆయన చికాగోలోని ఓ యూనివర్సిటీలో అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌కల్లా కొత్త గవర్నర్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. 2020 జనవరిలో కొత్త గవర్నర్‌ పదవీ బాధ్యతలు చేపడుతారు.  బ్రెగ్జిట్‌ నేపథ్యంలో ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గవర్నర్‌గా ఉన్న మార్క్‌ కార్నే స్థానంలో కొత్త వ్యక్తిని నియమించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పదవికి పోటీ చేస్తున్న ముఖ్యమైన వ్యక్తుల్లో రాజన్‌ ఒక్కరే యూకే వెలుపలి వ్యక్తి అని పలువురు ఆర్థిక నిపుణులు అంటున్నారు.

దీనిపై అటు రఘురాం రాజన్‌ గానీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గానీ స్పందించకపోవడం గమనార్హం. ముఖ్యంగా బ్రెగ్జి్‌ట్‌ ఓటింగ్‌ సమయంలో అయోమయంలో ఉన్న బ్రిటన్‌కు మద్దతుగా రాజన్‌ వ్యాఖ్యలు చేశారు. 2005లో ఐఎంఎఫ్‌లో ఉన్న సమయంలో ఆర్థిక మాంద్యం ముప్పును ముందే ఊహించారాయన. తొలి రోజుల్లో దీనిపై విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన మాటలు నిజమని తేలడానికి ఎంతోకాలం పట్టలేదు. 2008లో సంభవించిన ఆర్థికమాంద్యం వల్ల లీమన్‌ బ్రదర్స్‌ వంటి కంపెనీలే కుప్పకూలడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *