రణరంగంలో రాఫెల్ జెట్స్ చక్కర్లు

చైనాతో దాదాపు ఐదు నెలల నుంచి కొనసాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేసిన ఆర్మీ బలంగాల మోహరింపును పెంచింది. తాజాగా యుద్ధ విమానాలు ఓమ్ని-రోల్ రాఫెల్స్ ఇప్పుడు లడఖ్ మీదుగా ఆకాశంలో ఎగరడం ప్రారంభించాయి.

రణరంగంలో రాఫెల్ జెట్స్ చక్కర్లు
Follow us

|

Updated on: Sep 21, 2020 | 7:00 PM

చైనాతో దాదాపు ఐదు నెలల నుంచి కొనసాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేసిన ఆర్మీ బలంగాల మోహరింపును పెంచింది. తాజాగా యుద్ధ విమానాలు ఓమ్ని-రోల్ రాఫెల్స్ ఇప్పుడు లడఖ్ మీదుగా ఆకాశంలో ఎగరడం ప్రారంభించాయి.

సెప్టెంబరు 10 న అంబాలా ఎయిర్‌బేస్‌లో లాంఛనంగా సేవలను ప్రారంభించిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు.. ఇటీవల లడఖ్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. రాఫెల్ పైలట్లు అంబాలా నుండి లడఖ్ వరకు జెట్ల పహారా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. లడాఖ్ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులను ముందుగా అంచనా వేసేందుకు రాఫెల్స్ ప్రయాణించినట్లు పేర్కొన్నారు. రాఫెల్స్ మిషన్ స్వభావాన్ని బట్టి 780-కిమీ నుండి 1,650 కిమీల పోరాట పరిధిని కలిగి ఉంటాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, 300 కిలోమీటర్ల దూరంలోని `స్కాల్ప్’ ఎయిర్-టు-గ్రౌండ్ క్రూయిజ్ క్షిపణుల వంటి పొడవైన స్టాండ్-ఆఫ్ ఆయుధాలు తరలించగలవని అధికారులు వెల్లడించారు. ప్రపంచానికి ముఖ్యంగా భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేసేవారికి రాఫెల్స్ బలమైన హెచ్చరికగా భారత్ భావిస్తోంది.

జూలై 29 న ఐదు రాఫెల్స్ ఫ్రాన్స్ నుండి అంబాలా విమానాశ్రయానికి చేరుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని పర్వత ప్రాంతంతో సహా వివిధ భూభాగాలలో పగలు, రాత్రి సమయాల్లో పహారా కాస్తున్నాయి. రాఫెల్స్ ను అత్యవసర పరిస్థితుల్లో అవసరమైతే, పోరాటానికి వినియోగించాలే రణరంగంలోకి దింపింది ఆర్మీ. అంబాలా, హషిమారా ఎయిర్‌బేస్‌లతో పాటు పశ్చిమ-తూర్పు సరిహద్దుల వెంబడి 18 రాఫెల్స్‌ను సిద్ధంగా ఉంచాలని భారత ఆర్మీ నిర్ణయించినట్లు సమాచారం.