Breaking News
  • విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.3,500 కోట్ల భారం పడుతుంది. వైసీపీ చేతగాని తనంతోనే ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి దేవినేని ఉమ. ఐదు నెలలు ఇసుక దొరకకుండా దోచుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విజయవాడ: భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు. కనకదుర్గానగర్‌ మీదుగా భక్తులను ఆహ్వానిస్తున్నాం. భవానీల కోసం ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్‌లు ఏర్పాటు చేశాం. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించాం-ఈవో సురేష్‌ బాబు.
  • చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికలకు రజినీ మక్కల్‌ మండ్రం దూరం. ఏ పార్టీకి మద్దతు ప్రకటించని మండ్రం. రజినీ మద్దతు ఇస్తున్నట్టు ఎవరైనా ప్రచారం చేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
  • నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది-కోటంరెడ్డి . ప్రజలపై ఏ భారం వేయబోము అని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ఏటా రూ.700 కోట్ల భారం ప్రజలపై పడింది. మాట తప్పని జగన్‌ ఆర్టీసీ చార్జీల పెంపుపై సమాధానం చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాపీ కొడుతూ జగన్‌ కాపీ సీఎంగా మారారు -నూడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర అగ్నిప్రమాదం. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటులో మంటలు. మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది.
  • అమరావతి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. వాడీవేడిగా జరగనున్న సమావేశాలు. ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదలపై.. రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్న టీడీపీ. ఉల్లి ధరల పెరుగుదలపై టీడీపీ నిరసన. అసెంబ్లీ గేట్‌ నుంచి ఉల్లిపాయల దండలతో.. అసెంబ్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

మహిళా టీచర్‌పై దాడి .. ! విద్యార్థులా వీధి రౌడీలా..?

Teacher attacked in Uttar Pradesh, మహిళా టీచర్‌పై దాడి .. ! విద్యార్థులా  వీధి రౌడీలా..?

విద్యాబుద్దులు నేర్పించే గురువుతోనే విద్యార్థులు విధి రౌడీల్లా రెచ్చిపోయి ప్రవర్తించారు. మహిళా టీచర్‌ను చుట్టుముట్టిన  స్టూడెంట్స్ ఆమెపై దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలిలో చోటుచేసుకుంది. రాయ్‌ బరేలీలోని గాంధీ సేవా నికేతన్‌లో అనాథ పిల్లల కోసం పనిచేస్తున్న మమతా దూబేపై ఈ నెల 11న (నవంబర్‌) దాడి జరిగింది. విద్యార్థులంతా కూడబల్లుకుని గుంపులుగా చేరి ఆమెపై దాడి చేశారు.  రిగిన ఘటనపై బాధితురాలు టీచర్‌ మమతా దూబే మర్నాడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేసింది. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటుండగా తాను అడ్డుకునే ప్రయత్నం చేయగా ..వారంతా  కలిసి తనపై దాడి చేశారని మమతా పోలీసులకు తెలిపారు.
విద్యార్థులు టీచర్‌పై దాడి చేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చుట్టూ చేరిన విద్యార్థులు..ఆమెను రెచ్చగొట్టేలా మాట్లాడారు.  ఆమె హ్యాండ్‌ బ్యాగును విసిరేశారు. ఆమె వెళ్లి ఆ బ్యాగును తెచ్చుకుంది. మళ్లీ అదే విద్యార్థి ఓ ప్లాస్టిక్‌ కుర్చీతో ఆమెను కొట్టాడు. ఇది జరుగుతున్నంత సేపు మిగితా విద్యార్థులు పట్టించుకోలేదని… ఈ విషయాన్ని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని మమతా దూబే ఆరోపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారటంతో నెటిజన్లు విస్తుపోతున్నారు. విద్యార్థుల ప్రవర్తించిన తీరును తప్పుబడుతున్నారు.