Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

విషాదం..రేడియో రాంబాబు ఇకలేరు..!

Former AIR newsreader Venkataramaiah passes away, విషాదం..రేడియో రాంబాబు ఇకలేరు..!

రేడియో రాంబాబు..ఈ పేరు ఇప్పటి హైటెక్ జనరేషన్‌ను పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కాని రెండు, మూడు దశాబ్దాలకు ముందు ఆయనో స్టార్. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది..డి. వెంకట్రామయ్య అనే స్వరం అప్పట్లో ప్రతి ఇంటి రేడియోలో రోజు వినిపించేది. ఆ వాయిస్‌ రోజూ ఎన్నో తెలుగు గడపలను తాకేది. అటువంటి వ్యక్తి ఇకలేరు. సోమవారం(జనవరి13) ఆయన హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులతో పండగపూట సినిమా చూడటానకి వెళ్లి థియేటర్‌‌లోనే కుప్పకూలిపోయారు. దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా వెంకట్రామయ్య మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం ప్రకటించారు.

కృష్ణాజిల్లా దొండపాడు గ్రామంలో జన్మించిన వెంకట్రామయ్య కేవలం రేడియో వ్యాఖ్యతగానే కాదు.. నాటక రచయితగా, అనువాదకుడిగా, న్యూస్ రీడర్‌గానూ సత్తా చాటారు. 1963లో ఆకాశవాణిలో చేరిన ఆయన.. దాదాపు 30 ఏళ్ల అక్కడే సేవలందించారు. ఫేమస్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తీసిన ‘పంతులమ్మ’ సినిమాకు రచయితగానూ పనిచేశారు. ఆయన మృతి పట్ల పలు పేపర్, టీవీ జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం వెంకట్రామయ్య అంత్యక్రియలు ఈఎస్ఐ శ్మశాన వాటికలో జరిగాయి.