నచ్చితేనే ఓకే చెబుతా అంటున్న హాట్ బ్యూటీ.. ఆ విషయంలో బాగా రియలైజ్ అయ్యానంటున్న బాలీవుడ్ సొగసరి..

Radhika Apte: కరోనా వల్ల లాక్‌డౌన్ సమయంలో తనను తాను బాగా అర్థం చేసుకున్నానని అందుకే సినిమాల ఎంపిక విషయంలో

నచ్చితేనే ఓకే చెబుతా అంటున్న హాట్ బ్యూటీ.. ఆ విషయంలో బాగా రియలైజ్ అయ్యానంటున్న బాలీవుడ్ సొగసరి..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 12:50 PM

Radhika Apte: కరోనా వల్ల లాక్‌డౌన్ సమయంలో తనను తాను బాగా అర్థం చేసుకున్నానని అందుకే సినిమాల ఎంపిక విషయంలో రియలైజ్ అయ్యానని అంటోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే. టాలీవుడ్‌లో అడపదడపా సినిమాలలో కనిపించిన రాధికా పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సరీస్‌లతో బిజీగా మారింది. తాజాగా ఓ నేషనల్ ఎంటర్టైన్మెంట్ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హాట్ బ్యూటీ లాక్‌డౌన్‌లో తీసుకున్న నిర్ణయాలను ఇప్పడు ఇంప్లిమెంట్ చేస్తున్నానని చెబుతోంది.

తను చాలా సార్లు ప్రాజెక్ట్ మిస్ అవుతుందనే భయంతో, ఇన్‌సెక్యూరిటీతో కొన్ని సినిమాలు చేస్తానని ఇష్టంతో కావాలని మాత్రం ఒప్పుకోనని తెలిపింది. అలాంటి ప్రాజెక్టులు సక్సెస్ అయితే ఓకే అయినా కాకపోయినా సంతృప్తి మాత్రం ఉండదని తెలిపింది రాధిక. అందుకే ఫ్యూచర్‌లో నచ్చిన స్టోరీస్‌కు మాత్రమే ఓకే చెప్తాను అని నచ్చకపోతే కచ్చితంగా నో చెప్పాలని నిర్ణయించుకున్నాను అని వివరించింది. ఇతరులను చూసి బిజీగా ఉన్నారని లేదా వాళ్లు ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా అని మనం స్ట్రెస్‌లో పడకూడదని డిసైడ్ అయ్యాను అని అంటోంది రాధికా ఆప్టే.

పదేళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులకు గురయ్యా.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన సింగర్ నేహా