రేపటి నుంచి మూడు రోజులపాటు రాచకొండ పర్యాటక ఉత్సవాలు

హైదరాబాద్ : ఎంతో చరిత్ర కలిగిన రాచకొండ ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. రాచకొండను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాచకొండ పూర్వవైభవాన్ని నేటితరానికి చాటిచెప్పేందుకు పర్యాటక ఉత్సవ కమిటీ, భాష సాంస్కృతిక శాఖ, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించేందుకు అడుగులు వేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 3నుంచి 5వరకు రాచకొండ పర్యాటక ఉత్సవాలు ప్రభుత్వం నిర్వహించనున్నది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాచకొండలో […]

రేపటి నుంచి మూడు రోజులపాటు రాచకొండ పర్యాటక ఉత్సవాలు
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2019 | 10:23 AM

హైదరాబాద్ : ఎంతో చరిత్ర కలిగిన రాచకొండ ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. రాచకొండను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాచకొండ పూర్వవైభవాన్ని నేటితరానికి చాటిచెప్పేందుకు పర్యాటక ఉత్సవ కమిటీ, భాష సాంస్కృతిక శాఖ, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించేందుకు అడుగులు వేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 3నుంచి 5వరకు రాచకొండ పర్యాటక ఉత్సవాలు ప్రభుత్వం నిర్వహించనున్నది.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాచకొండలో ఎనిమిది అడుగుల స్వయంభూ శివలింగాన్ని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు ఆలయ ప్రాంగణంలో రాచకొండ చారిత్రాత్మక పర్యావరణ పర్యాటక పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు పెద్దఎత్తున రంగారెడ్డి, యాదాద్రి, నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి భక్తులు ఇక్కడికి తరలివచ్చి స్వయంభూ శివలింగాన్ని దర్శించుకొని రాచకొండలో చరిత్ర కలిగిన పురాతన దేవాలయాల విశిష్టతను తెలుసుకోనున్నారు.