Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం 18 లక్షల 55 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 1855746 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 586298 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 1230510 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 38938 దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 52050 కరోనా కేస్ లు, 803 మంది మృతి
  • తెలంగాణ బీజేపీ కార్యాలయానికి కరోనా ఎఫెక్ట్. కార్యాలయాన్ని సోమవారం వరకు మూసి ఉంచాలని నిర్ణయించిన రాష్ట్ర నాయకత్వం. జాతీయ పార్టీ కీలక నేతలు కరోనా బారిన పడటంతో రాష్ట్ర కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించ కూడదని నిర్ణయం.
  • అమరావతి : ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం. 3రాజధాని అంశంపై హైకోర్టు విచారణ. రాజధాని తరలింపుపై స్టే ఇచ్చిన హైకోర్టు. గవర్నర్ గెజిట్ పై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్ట్.
  • రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించిన హైకోర్టు. 10 రోజులపాటు స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతున్న హైకోర్టు. రెండు బిల్లులకు సంబంధించి ఇదివరకే గెజిట్‌ విడుదల. తదుపరి కార్యకలాపాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు.
  • అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. కొరియాకు చెందిన సీఈఓ, డైరెక్టర్ సహా మొత్తం 12 మందికి కండిషన్ బెయిల్ ఇస్తూ ఆదేశాలు. స్టెరైన్ గ్యాస్ నిల్వ లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నమోదైన కేసులో వీరిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు.
  • Ccmb డైరెక్టర్ రాకేష్ మిశ్రా . జర్నల్స్ పై ఫార్మాకంపెనీల వత్తిడిపై ట్విట్టర్లో స్పందించిన Ccmb డైరెక్టర్. సైంటిస్టులు, జర్నల్స్ పై వివిధ ఫార్మాకంపెనీలు వత్తిడి చేయడం సరి కాదు. దైవంలా భావించే జర్నల్స్ మీద ఒత్తిడి సిగ్గుచేటు. ఆర్థికంగా బలమైన ఫార్మా కంపెనీలు తమ పరిశోథన పత్రాలను ప్రచురించమని వత్తిడిచేయడం సరైందికాదు . తమ పరిశోధనలను అంగీకరించమని జర్నల్స్ పై వత్తిడి మంచిది కాదు. ది లాన్సేంట్, ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లు వివిధ కంపెనీల వత్తిడిని బయటపెట్టడం ఆందోళన కల్గిస్తోంది.
  • మరో మూడు కార్పొరేట్‌ ఆస్పత్రులకు కోవిడ్ సేవలు కట్...! హైదరాబాద్ లో కరోనా ట్రీట్ మెంట్ చేస్తున్న మరికొన్ని ఆస్పత్రులకు ఆరోగ్య నోటీసులు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ప్రభుత్వం యాక్షన్ .

అమ్మాయిలు ఎక్కడికి వెళ్లినా పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకోండి.. : రాశీ

Raashi Khanna Interview, అమ్మాయిలు ఎక్కడికి వెళ్లినా పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకోండి.. : రాశీ

ఊహలు గుసగుసలాడే మూవీతో ఎంట్రీ ఇచ్చిన అందాల బొమ్మ రాశీ ఖన్నా.. అనతికాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న రాశీ.. తన ఫిట్‌నెస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కెరీర్ ప్రారంభంలో బొద్దుగా ఉన్న రాశీ.. ప్రస్తుతం స్లిమ్‌గా తయారైంది. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు రాశీ ఖన్నా రెడీ అయ్యింది. ప్రస్తుతం వెంకీమామ, ప్రతీ రోజూ పండగే అంటూ హడావిడి చేస్తున్న రాశీ ఖన్నా.. తాజాగా వెంకీమామ మూవీ విశేషాలను గురువారం మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా అనేక విషయాలను వెల్లడించింది.

మీరు తెలుగు బాగానే మాట్లాడుతున్నారే..?
అవును.. ఇప్పుడు నేను తెలుగమ్మాయిని అయిపోయా..

వెయిట్ బాగా తగ్గినట్లున్నారు..?
అవును. చాలా తగ్గాను. జిమ్‌లో చాలా కష్టపడ్డాను. షూటింగ్, జిమ్.. ఇవే నా లైఫ్ అయిపోయాయి. వెయిట్ తగ్గించుకోవాలనే దానికంటే ఫిట్‌గా ఉండాలనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టాను.

ఎంత వెయిట్ తగ్గారు..?
వెయిట్ ఎంత తగ్గామన్న దానికంటే.. ఫిట్ నెస్‌ కంట్రోల్‌ ఉంచుకోవడం ముఖ్యం. అది సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్ మెంట్ కూడా. ఫిట్‌నెస్‌ పెంచుకునే దానిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఫ్యాట్‌ను తగ్గించుకొని, మజిల్స్‌ను స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. గతంతో కంపేర్ చేస్తే.. ఇప్పుడు చాలా ఫిట్‌గా ఉన్నా.. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తప్ప ఇలాగే ఉండాలనుకుంటున్నా.

‘వెంకీమామ’లో మీ క్యారెక్టర్ ఏంటి?
వెంకీమామలో.. నా రోల్ పేరు హారిక. ఒక ఫిలింమేకర్. ఒకరోజు అనుకోకుండా మా మేనేజర్‌కు సురేశ్‌బాబు ఫోన్ చేశారు. అప్పుడు నేను పాండిచ్చేరిలో తమిళ్ ఫిల్మ్ ‘అయోగ్య’ షూటింగ్‌లో ఉన్నాను. ఇంతకు ముందే నేను చైతూతో కలిసి ‘మనం’లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాను. ఆ మూవీకి ఒక రోజే పనిచేశాను. అతనితో కలిసి వర్క్ చెయ్యాలంటే.. ఇంటెన్స్ లవ్‌స్టోరీ అయితే బాగుంటుందనేది అప్పటి వరకు నాలో ఉన్న అభిప్రాయం. అయితే ఈ చిత్రంలో ఆఫర్ వచ్చినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వెంకీ, చైతూ కలిసి నటిస్తున్న చిత్రం కావడం.. ఆ ఇద్దరూ మేనమామ మేనల్లుళ్లు కావడం. అంతేకాదు.. ‘ప్రేమం’లో కూడా ఆ ఇద్దరూ కలిసి ఒక సీన్‌లో నటించారు. ఆ ఇద్దరూ కలిసి నటించాలని వాళ్ల అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ‘జై లవ కుశ’లో ఇదివరకే నేను డైరెక్టర్ బాబీతో పనిచేశాను. అందువల్ల కంఫర్ట్ లెవల్ బాగుంటుందనుకుని వచ్చేశాను. ఇక నా సీన్లు ఎక్కువగా ఫస్టాఫ్‌లో ఉన్నాయి. సెకండ్ ఆఫ్ కథ ఎక్కువగా మామా అల్లుళ్ల మధ్య ఎమోషనల్ సీన్స్‌తో వెళ్తుంది.

ఒక్క హీరో ఉంటేనే.. హీరోయిన్లకు చాన్స్ తక్కువ.. మరి ఇద్దరు హీరోలుంటే చాన్స్ వస్తుందనుకున్నారా..?
అలా ఏం లేదు. ఇప్పటికే ఇద్దరు ఉన్న సినిమాలు చేశాను. అది అసలు సమస్యే కాదు. నాకు మంచి క్యారెక్టర్ ఉంటే చాలు. చెయ్యడానికి అభ్యంతరమే ఉండదు. ఆడియన్స్ నా క్యారెక్టర్‌ను గుర్తుంచుకుంటే చాలు. ఎవరేం క్యారెక్టర్ చేస్తున్నారనేది చూడటం నా పని కాదు. గతంలో మలయాళంలో హీరోయిన్ కాకపోయినా కూడా మంచి రోల్ చేశాను. ‘వెంకీమామ’లో మా నలుగురి క్యారెక్టర్లనూ బాబీ బాగా రాశారు.

ఎప్పట్నుంచి మీరు వెంకీ గారికి ఫ్యాన్ అయ్యారు?
నా చిన్నప్పట్నుంచే వెంకీ గారికి ఫాన్ అయ్యాను. టీవీలో ఆయన హిందీ డబ్బింగ్ మూవీస్ చూసేదాన్ని. అప్పటినుంచే ఆయన సినిమాలంటే ఇష్టం. అంతకంటే ఒక వ్యక్తిగా ఆయనంటే నాకు చాలా రెస్పెక్ట్. ఆయన వెరీ స్పిరుచ్యువల్, వెరీ నైస్ పర్సన్.

సింగర్‌గా కూడా బిజీ అయ్యారట..?
నాకుడ చిన్నప్పటి నుంచి పాటలు పాడటం అంటే ఎంతో ఇష్టం. సింగర్ అవ్వాలని కోరిక ఉండేది. చిన్నప్పుడు పాడటం నేర్చుకుని.. సింగింగ్ కాంపిటిషన్లో పాల్గొనేదాన్ని. ఇటీవల ఓ సినిమాలో పాట పాడా. అది కూడా తెలుగు లోనే. ఏ సినిమా అన్నది ఇప్పుడే చెప్పను.

దిశ వంటి ఘటనలను చూస్తుంటే ఏమనిపిస్తుంది?
ఇలాంటి ఘటనలు చూస్తే కోపంతో పాటు.. భయం కూడా కల్గుతుంది. అయితే మార్పుకోసం చట్టాలు మారాలి. అవి మారాలంటే మన పాలకులు దృష్టిసారించాలి. అండ్ అమ్మాయిలకు చెప్పే సూచన ఒక్కటే. మీ జాగ్రత్తలో మీరు ఉంటూ.. పెప్పర్‌ స్ప్రేని అందుబాటులో ఉంచుకోండి.

Related Tags