అభూత కల్పనలు దేశాన్ని నడిపించలేవు: ప్రణబ్ ముఖర్జీ

ఆచరణ శూన్య సాహస కృత్యాలు, అభూత కల్పనలు దేశాన్ని నడిపించలేవని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. సోమవారం ఏఐఎంఏ మేనేజింగ్ ఇండియా అవార్డ్స్ కార్యక్రమంలో ప్రణబ్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత విధానాలు, పథకాలు పేదరికాన్ని సమూలంగా నిర్మూలించలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపదలో ఎక్కువ శాతం అతికొద్ది మంది వద్ద ఉండడమే దీనికి కారణం అని అన్నారు. ‘‘ఆచరణ శూన్య సాహస కృత్యాలు దేశాన్ని నడిపించలేవు. దేశ ప్రజలందరూ కోరుకునే సంక్షేమ […]

అభూత కల్పనలు దేశాన్ని నడిపించలేవు: ప్రణబ్ ముఖర్జీ
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2019 | 4:32 PM

ఆచరణ శూన్య సాహస కృత్యాలు, అభూత కల్పనలు దేశాన్ని నడిపించలేవని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. సోమవారం ఏఐఎంఏ మేనేజింగ్ ఇండియా అవార్డ్స్ కార్యక్రమంలో ప్రణబ్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత విధానాలు, పథకాలు పేదరికాన్ని సమూలంగా నిర్మూలించలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపదలో ఎక్కువ శాతం అతికొద్ది మంది వద్ద ఉండడమే దీనికి కారణం అని అన్నారు.

‘‘ఆచరణ శూన్య సాహస కృత్యాలు దేశాన్ని నడిపించలేవు. దేశ ప్రజలందరూ కోరుకునే సంక్షేమ పాలనను నిజం చేయగలిగే పాలకులే ప్రస్తుతం దేశానికి అవసరం. కానీ, దేశం నుంచి పేదరికాన్ని పారద్రోలడానికి ఇంకా చాలా కాలం పట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి’’ అని ప్రణబ్ అన్నారు. దేశంలోని 60 శాతం సంపద కేవలం ఒక్క శాతం ప్రజల వద్ద ఉండిపోయిందని, పేదరికాన్ని తరిమేందుకు కార్పొరేట్ సంస్థలు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని పిలుపునిచ్చారు. ఇండియాలో ధనిక, పేద తరగతుల మధ్య ఆంతర్యం చాలా అధికమని, ఈ గణాంకాలు దేశ వృద్ధికి విఘాతమని ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు.