Covid 19: షాకింగ్ న్యూస్… సీజనల్ వ్యాధిగా కరోనా !

తాజాగా కరోనా వైరస్ కు సంబంధించి మరో భయంకర నిజాన్ని బయపెట్టారు ప్రఖ్యాత క్వీన్ మేరీ వర్సిటీ శాస్త్రవేత్తల బ‌ృందం..వారు చేసిన ఆ ప్రకటన ప్రపంచ దేశాలను మరింత కలవరపెడుతోంది..కరోనా ఇప్పటికిప్పుడు తగ్గిపోయేది కాదు..ఇంకా చెప్పాలంటే...

Covid 19: షాకింగ్ న్యూస్... సీజనల్ వ్యాధిగా కరోనా !
Follow us

|

Updated on: Mar 04, 2020 | 10:53 AM

ప్రపంచం ఇప్పుడు కంటికి కనిపించని శత్రవుతో పోరాటం చేస్తోంది. కొవిడ్- 19 మహమ్మారి దాటికి అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 80 దేశాలకు విస్తరించిన వైరస్.. 93 వేల 160 మందిని సోకినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 3 వేల 203 మంది ఈ వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. ఇంకా వేల సంఖ్యలో వైరస్ భాదితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  ఇవన్నీ అధికారిక లెక్కలు మాత్రమే. ఈ క్రమంలోనే తాజాగా కరోనా వైరస్ కు సంబంధించి మరో భయంకర నిజాన్ని బయపెట్టారు ప్రఖ్యాత క్వీన్ మేరీ వర్సిటీ సైంటిస్టుల బృందం. ఆ ప్రకటన ఇప్పుడు మరింత కలవరపెడుతోంది. వివరాల్లోకి వెళితే…

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 వైరస్ గురించి లండన్‌కు చెందిన క్వీన్ మేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మరో కొత్త విషయాన్ని బయటపెట్టారు.  కరోనా కూడా సీజనల్ వ్యాధిగా మారి ప్రజల్ని వెంటాడుతుందని తాజా అద్యయనంలో వెల్లడించారు.  కరోనా వైరస్ ఓ సారి వచ్చి వెళ్లిపోదు…ఇది కూడా సీజనల్ వ్యాధుల్లాగానే ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. సహజంగా సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు వంటివి కరోనా వైరస్‌ వ్యాప్తికి దోహదపడతాయని చెప్పారు. జలుబు, చెస్ట్ ఇన్‌ఫెక్షన్, స్వైన్‌ఫ్లూ లానే కరోనా కూడా శాశ్వత వైరస్ అని శాస్త్రవేత్తలు గుర్తించినట్లుగా తెలిపారు.. గత 50 ఏళ్లుగా మనందరికీ తెలిసిన వైరస్ వంటిదే కరోనా కూడా అని లండన్ సైంటిస్ట్ బ‌ృందం స్పష్టం చేసింది.

కరోనాలో సీజనల్ వ్యాధుల లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, అది ఇప్పటికిప్పుడు తగ్గిపోయే లేదా అంతమైపోయే వైరస్ కాదని సైంటిస్టులు చెప్పారు. సీజనల్ ఇన్‌ఫెక్షన్ లాగా మళ్లీ మళ్లీ విజృంభించే అవకాశాలు కరోనాలో చాలా ఉన్నాయని వారు వివరించారు. ఫలితంగా ప్రపంచ జనాభాలో దాదాపు 70శాతం మందికి పైగా కరోనా సోకే అవకాశాలు లేకపోలేదని వారు హెచ్చరించారు. కరోనా వైరస్ పూర్తిగా అంతరించిపోతుందని ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈ మేరకు క్వీన్ మేరీ వర్సిటీ సైంటిస్టుల నివేదిక ఆధారంగా ప్రఖ్యాత డెయిలీ మెయిల్ లో ప్రత్యేక కథనం ప్రచురించారు.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు