కరోనా ఎఫెక్ట్: బ్రిట‌న్ రాచ కుటుంబంలో.. ఆ వేడుక ర‌ద్దు..!

కోవిద్-19 మహమ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 21 ల‌క్ష‌ల 92 వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే ల‌క్షా 47 వేల‌మంది ప్రాణాలు కోల్పోయారు. దీని బారి నుంచి

కరోనా ఎఫెక్ట్: బ్రిట‌న్ రాచ కుటుంబంలో.. ఆ వేడుక ర‌ద్దు..!
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2020 | 4:39 PM

కోవిద్-19 మహమ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 21 ల‌క్ష‌ల 92 వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే ల‌క్షా 47 వేల‌మంది ప్రాణాలు కోల్పోయారు. దీని బారి నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌జ‌లు, సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. అన్ని ర‌కాల కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. తాజాగా బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్ మ‌న‌వ‌రాలు పెళ్లి వాయిదా ప‌డినట్లు సమాచారం. యువ‌రాణి బియ‌ట్రైస్‌-ఎడోయార్డో మాపెల్లి మొజ్జిల పెళ్లి వ‌చ్చేనెల‌లో జ‌ర‌గాల్సి ఉండ‌గా, నిర‌వ‌ధికంగా వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.

మరోవైపు.. గ‌త మార్చిలోనే వీళ్ల వివాహం జ‌ర‌గాల్సి ఉండ‌గా.. అప్ప‌ట్లో క‌రోనా వైర‌స్ ఉనికిలోకి రావ‌డంతో పెళ్లిని మేకి వాయిదా వేశారు. తాజాగా కరోనా వైర‌స్ ఏమాత్రం అదుపులోకి రావ‌డంతో.. వ‌చ్చేనెల‌లో ప్ర‌తిష్టాత్మ‌క బంకింగ్‌హ్యామ్ పాలెస్‌లో జ‌ర‌గాల్సిన పెళ్లిని వాయిదా వేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వేదిక‌ను మార్చ‌డం గురించి రాచ‌కుటుంబం ఆలోచించ‌డం లేద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి.

ఈ కరోనా కాలంలో.. పెళ్లి గురించి రాచ‌కుంటుంబ వ‌ర్గాలు ఆలోచించ‌డం లేద‌ని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగాక ఈ పెళ్లి గురించి ఆలోచించే అవ‌కాశ‌ముంద‌ని తెలిపాయి. అయితే ఈ పెళ్లి గురించి రాచ‌కుటుంబ వ‌ర్గాలు ఇప్ప‌టివ‌ర‌కు ఏమాత్రం అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

Also Read: కరోనా లాక్‌డౌన్ వేళ.. 10 లక్షల మందికి భోజనాలు..