బ్రిటన్ రాణికి కరోనా భయం.. బకింగ్ హాం ప్యాలస్ ఖాళీ

కరోనా భయంతో బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2.. రాజభవనం 'బకింగ్ హాం ప్యాలస్' ను వీడుతున్నారు. 93 ఏళ్ళ ఈమెను ఈ ప్యాలస్ కి దూరంగా ఉన్న విండ్సర్ కేజిల్ కి తీసుకువెళ్లారు. అక్కడ ఆమె దాదాపు ఐసొలేషన్ లో ఉంటారని ఈ ప్యాలస్ వర్గాలు తెలిపాయి.

బ్రిటన్ రాణికి కరోనా భయం.. బకింగ్ హాం  ప్యాలస్ ఖాళీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 15, 2020 | 5:07 PM

కరోనా భయంతో బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2.. రాజభవనం ‘బకింగ్ హాం ప్యాలస్’ ను వీడుతున్నారు. 93 ఏళ్ళ ఈమెను ఈ ప్యాలస్ కి దూరంగా ఉన్న విండ్సర్ కేజిల్ కి తీసుకువెళ్లారు. అక్కడ ఆమె దాదాపు ఐసొలేషన్ లో ఉంటారని ఈ ప్యాలస్ వర్గాలు తెలిపాయి. బ్రిటన్ లో కరోనా కారణంగా మరో 10 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 21  కి పెరిగింది. ఎలిజిబెత్ రాణి ఆరోగ్యంగా ఉన్నారని, అయితే ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్యాలస్ ఖాళీ చేస్తున్నారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఈ విశాల భవనంలోని సిబ్బంది చాలామంది కోవిడ్-19 భయంతో వణికిపోతున్నారు. ఇటీవల ఎలిజిబెత్ రాణి చాలా మందిని కలుసుకున్నారు. దాంతో ఆమెకు ఈ భయంకర వైరస్ ఎక్కడ సోకుతుందోనని భయపడుతున్నారు. వచ్ఛే నెలలో ఈమె 94 వ బర్త్ డే జరగాల్సి ఉంది. అయితే ఈ వైరస్ కారణంగా ఆ కార్యక్రమాలు రద్దు కావచ్ఛు. పైగా త్వరలో తాను జరపబోయే రెండు పర్యటనలను కూడా ఆమె వాయిదా వేసుకున్నారు.

విండ్సర్ గ్రేట్ పార్క్ లోని ఓ భవంతిలో గల సిబ్బందిలో ముగ్గురికి కరోనా లక్షణాలు కనబడడంతో ఆ భవనాన్ని పెద్ద ఎత్తున శుభ్రం చేస్తున్నారు. కాగా.. బ్రిటన్ లో ఎప్పుడూ జనసమ్మర్థంతో కనిపించే అనేక ప్రాంతాలు, రోడ్లు, కరోనా కారణంగా జనం లేక బోసిపోతున్నాయి.  సదా రద్దీగా ఉండే బకింగ్ హాం ప్యాలస్ నిర్మానుష్యంగా మారింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యికి పైగా పెరిగింది. అయితే ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని  ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..