క్యూనెట్ స్కామ్: హీరోయిన్ పూజాహెగ్దేకు నోటీసులు..!

Qnet Scam: Cyberabad Police issue Notices to Celebrities, క్యూనెట్ స్కామ్: హీరోయిన్ పూజాహెగ్దేకు నోటీసులు..!

క్యూనెట్ కంపెనీకి ప్రమోషన్ చేసిన ఏడుగురు సెలబ్రెటీలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరిలో.. అనిల్ కపూర్, బోమన్ ఇరానీ, జాకీ ఫ్రాఫ్, పూజాహెగ్దే, షారుఖ్ ఖాన్‌లకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్యూనెట్ సంస్థ భారీ మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటికే ఈ సంస్థపై 15 కేసులు నమోదయ్యాయి. కాగా.. దేశవ్యాప్తంగా కూడా లక్షల్లో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా.. హైదరాబాద్‌లో క్యూనెట్ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరవింద్.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో క్యూనెట్‌లో రూ.20 లక్షలు పెట్టుబడిగా పెట్టి మోసపోయాడు. దీంతో.. అరవింద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు క్యూనెట్‌కు ప్రమోటర్లుగా వ్యవహరించిన 500 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఈ కంపెనీకి ప్రమోషన్ చేసే సెలబ్రెటీలకు కూడా నోటీసులిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *