ప్రముఖుల మెడకు ఉచ్చు.. మళ్లీ నోటీసులు..!

Qnet Scam: Cyberabad Police Issue Notices To Celebraties For Second Time, ప్రముఖుల మెడకు ఉచ్చు.. మళ్లీ నోటీసులు..!

క్యూనెట్ కేసులో సైబరాబాద్ పోలీసులు వేగం పెంచారు. ఈ స్కామ్‌కు సంబంధించి గతంలో 500 మంది ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. గతంలో నోటీసులు అందుకున్న వారిలో షారుఖ్, బొమన్ ఇరానీ, అనిల్ కపూర్ తమ లాయర్ల ద్వారా సమాధానమిచ్చారు. ఇక పూజా హెగ్డే, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్ తదితరుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా వీరంతా గతంలో ఈ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా వ్యవహరించారు. వారి ప్రకటనలు, యాడ్‌లను చూసే తాము ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టామని బాధితులు తెలపడంతో పోలీసులు వీరందరికీ నోటీసులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *