మత్స్యకారుల వలలో భారీ కొండచిలువ

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు రాయలసీమను ముంచేత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు జోరుగా చేపల వేటకు వెళుతున్నారు.

మత్స్యకారుల వలలో భారీ కొండచిలువ
Follow us

|

Updated on: Sep 21, 2020 | 12:39 PM

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు రాయలసీమను ముంచేత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రైతులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరదలు ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు జోరుగా చేపల వేటకు వెళుతున్నారు. అలా వేటకు వెళ్లిన జాలర్ల వలకు భారీ కొండచిలువ చిక్కింది. వల బరువు చూసి పెద్ద మొత్తంలోనే చేపలు చిక్కాయనుకున్న మత్స్యకారులు కొండచిలువను చూసి ఖంగుతిన్నారు. ఈ కర్నూలు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు మండలం బైర్లూటీ సమీపంలో అమలాపురానికి చెందిన మత్స్యకారులు సిద్ధాపురం చెరువులో చేపల వేటకు వెళ్లారు. చెరువులో వల వేసి లాగగా..ఇందులో భారీ కొండ చిలువ చిక్కుకుంది.. తర్వాత దానిని గమనించి షాక్ తిన్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్నసిబ్బంది వల నుంచి కొండచిలువను బయటకు తీసి నల్లమల అభయారణ్యంలో వదిలేశారు. జిల్లా అంతటా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో కొండచిలువ కొట్టుకువచ్చినట్లుగా మత్స్యకారులు భావిస్తున్నారు.