వలకు చిక్కిన కొండచిలువ

వరంగల్ రూరల్ జిల్లాలో చేపల కోసం వేసిన వలలో భారీ కొండ చిలువ పడింది. కొండచిలువ రావడంతో మత్స్యకారుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

వలకు చిక్కిన కొండచిలువ
Follow us

|

Updated on: Sep 28, 2020 | 1:10 PM

వరంగల్ రూరల్ జిల్లాలో చేపల కోసం వేసిన వలలో భారీ కొండ చిలువ పడింది. ఈ సంఘటన ఆదివారం నాడు వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో చోటు చేసుకుంది. చేపల వేటకోసం వేసిన వలలో ఎనిమిది అడుగుల పొడవు ఉన్న కొండచిలువ చిక్కింది. నల్లబెల్లి ఊర చెరువు మత్తడి కింద ప్రవహిస్తున్న వాగులో మత్స్యకారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో చేపలు పట్టేందుకు వెళ్తున్నారు.

మామూలుగానే చెరువులో వల వేసిన మత్స్యకారులకు వల బరువుగా మారటంతో పైకి లాగి చూడగా..అందులో భారీ కొండచిలువ కనిపించింది. దానిని చూసి భయపడిపోయిన మత్స్యకారులు వెంటనే చెరువు నుంచి బయటకు వచ్చారు. వలలో చిక్కిన కొండ చిలువ గురించి స్థానిక పోలీసులు,అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షలకు వరద నీరు చెరువు లోకి చేరినప్పుడు కొండచిలువ కూడా వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొండచిలువను స్థానిక అటవీ ప్రాంతంలోకి విడిచిపెట్టారు. వలకు చిక్కిన కొండచిలువను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. మరోవైపు కొండచిలువ రావడంతో మత్స్యకారుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.