బాబోయ్‌..కొండచిలువ..! లేడిని పట్టి చుట్టేసిన దృశ్యం..!

భారీ కొండచిలువ కొలనులో మాటువేసి ఓ లేడిని అమాంతం పట్టేసి చుట్టేసిన దృశ్యం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొండ చిలువలు ఆహారం కోసం వేటాడేటప్పుడు ఎలా మెరుపు దాడి చేస్తాయో..ఆ వీడియోలో కళ్లకు కట్టినట్టు కనిపించింది. మహారాష్ట్రకు చెందిన ఐఎఫ్ఎస్‌ అధికారి ఒకరు ఈ నెల 21న తన ట్విట్టర్‌ ఖాతాలో ఆ వీడియో పోస్ట్‌ చేశారు. అప్పట్నుండి కొండచిలువ వేటాడే దృశ్యాలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు…అందులోని దృశ్యాలు పరిశీలించినట్లయితే…నీటిమడుగులో నీరు తాగేందుకు […]

బాబోయ్‌..కొండచిలువ..! లేడిని పట్టి చుట్టేసిన దృశ్యం..!
Follow us

|

Updated on: Nov 25, 2019 | 9:38 PM

భారీ కొండచిలువ కొలనులో మాటువేసి ఓ లేడిని అమాంతం పట్టేసి చుట్టేసిన దృశ్యం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొండ చిలువలు ఆహారం కోసం వేటాడేటప్పుడు ఎలా మెరుపు దాడి చేస్తాయో..ఆ వీడియోలో కళ్లకు కట్టినట్టు కనిపించింది. మహారాష్ట్రకు చెందిన ఐఎఫ్ఎస్‌ అధికారి ఒకరు ఈ నెల 21న తన ట్విట్టర్‌ ఖాతాలో ఆ వీడియో పోస్ట్‌ చేశారు. అప్పట్నుండి కొండచిలువ వేటాడే దృశ్యాలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు…అందులోని దృశ్యాలు పరిశీలించినట్లయితే…నీటిమడుగులో నీరు తాగేందుకు వచ్చిన జింకల గుంపుపై ఉన్నట్టుండి ఒక్కసారిగా కొండచిలువ విరుచుకుపడింది. అందులోని ఓ లేడిని చుట్టచుట్టేసి నీళ్లలోకి జారిపోయింది. జరిగిన సీన్‌ చూస్తే…ఒళ్లు గగ్గుర్పొడిచేలా కనిపించింది. మహారాష్ట్రలోని చందా డివిజన్‌ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీల్లో రికార్డైన దృశ్యాలుగా తెలుస్తోంది.