Breaking News
  • టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఓటరు నమోదు ఇంచార్జి లతో మాట్లాడిన కేటీఆర్. అక్టోబర్ 1 నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన  కేటీఆర్.
  • కర్ణాటకలో కరోనాకు బలవుతున్న ప్రజాప్రతినిధులు. ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణ రావు మృతి. కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో ఉన్న ఎమ్మెల్యే. నిన్న మృతిచెందిన కేంద్ర మంత్రి సురేశ్ అంగాడి. అంగాడీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెలగావి (బెలగాం) కూడా కర్ణాటకలోనే అంతకు ముందు కర్ణాటక బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ మృతి.
  • ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కి కోరిన పాజిటివ్. నిన్నటి నుండి బీజేపీ తలపెట్టిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి.
  • ఏసీబీ అధికారులకు మాజీమంత్రి అయ్యన్న, ఎమ్మెల్యే వెలగపూడి ఫిర్యాదు. మంత్రి జయరాంపై ఫిర్యాదు చేసిన అయ్యన్నపాత్రుడు, వెలగపూడి. మంత్రి జయరాం, ఆయన కుమారుడిపై ఫిర్యాదు చేశాం. ఆధారాలుంటే చూపించండి రాజీనామా చేస్తామని జయరాం అన్నారు. అన్ని ఆధారాలు చూపించా-మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు. ఏసీబీ ప్రభుత్వం కంట్రోల్‌లో ఉంది. న్యాయం జరగకపోతే గవర్నర్‌ను కలుస్తాం-అయ్యన్నపాత్రుడు.
  • సినీ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు సమన్లు. నోటీసులు అందుకున్నట్టు వెల్లడించిన రకుల్‌ప్రీత్‌సింగ్‌. రేపు ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరుకానున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌. డ్రగ్స్‌ కేసులో రకుల్‌ప్రీత్‌సింగ్‌పై ఆరోపణలు.
  • కడప: కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ నేతల నిరసన. సీఎం జగన్‌ ప్లాన్‌ ప్రకారమే అంతా నడుస్తోంది. జగన్‌ మౌనంగా ఉంటూ ఆనందిస్తున్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతోంది. వైవీ సుబ్బారెడ్డి, కొడాలి నాని వెంటనే రాజీనామా చేయాలి. -మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.
  • మహారాష్ట్ర: భివాండిలో భవనం కూలిన ఘటనలో 41కి చేరిన మృతుల సంఖ్య. ఘటనా స్థలంలో పూర్తయిన సహాయక చర్యలు.

సీన్ రివర్స్….విజయవాడ వైసీపీ అభ్యర్థిగా పీవీపీ?

, సీన్ రివర్స్….విజయవాడ వైసీపీ అభ్యర్థిగా పీవీపీ?

అమరావతి :బెజవాడ వైసీపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) రేపు వైకాపా అధినేత జగన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పీవీపీ పోటీ చేసే అవకాశం ఉంది. కాగా ఈ నెల 23న ఆయన నామినేషన్‌ వేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లోనే వైసీపీ తరఫున పీవీపీ విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఆయనకు సీటు దక్కలేదు. ఈ సారి కూడా ఆయన విజయవాడ నుంచే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడంతో వైకాపా అధిష్ఠానం కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.

అయితే విజయవాడ లోక్‌సభ స్థానం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ ఇటీవల దాసరి జైరమేశ్‌ తెదేపా నుంచి వైకాపాలో చేరారు. ఆయన సొదరుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థన్‌రావు కూడా ఇటీవలే పార్టీలో చేరారు. దీంతో ఆయన భవిష్యత్‌ సందిగ్ధంలో పడింది. జైరమేశ్‌ను పక్కనబెట్టడంపై ఆయన వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

Related Tags