Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

వీల్‌ చైర్‌లో వెళ్లిపోయిన దెయ్యం..

Wheel Chair Moves in Chandigarh PG Hospitals, వీల్‌ చైర్‌లో వెళ్లిపోయిన దెయ్యం..

దెయ్యం ఉందంటే మీరు నమ్ముతారా..? ఖచ్చితంగా నమ్మరు..ఎందుకంటే..ఈ రోజుల్లో దెయ్యాలు, భూతాలు ఏంటీ..? అందంతా మన భ్రమ, భయం లేదా అనుమానం అనుకుంటారు..ఇంతకీ దెయ్యాలు ఉన్నాయా..? లేవా..? అనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం లేదు.  కానీ, చంఢీఘర్‌లోని ఓ ఆస్పత్రిలో చోటుచేసుకున్న సంఘటన మాత్రం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తూ…ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సెప్టెంబర్‌ 19న చంఢీఘర్‌లోని పీజీఐ ఆస్పత్రిలో సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు గమనించినట్లయితే..మీరు కూడా ఆశ్చర్యపోతారు..ఆస్పత్రి ఆవరణలో నిలిపి ఉంచిన వీల్‌ చైర్‌ ఒకటి ఉన్నంట్టుండి ముందుకు వచ్చింది..అలాగే కదులుతూ..ఇంకా ముందు ముందుకు వెళ్లిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ కూడా ఇదెక్కడి వింత అంటూ చూస్తుండిపోయాడు. ఆ కుర్చీని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. కొంచెం భయపడి షాక్‌కు గురై అలా నిల్చుండిపోయాడు. ఈ విజువల్స్ అన్ని అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అదే సమయంలో ఆ వీల్ చైర్ పక్కనే ఉన్న ఇతర చైర్ లు గానీ, వస్తువులు కానీ ఏమాత్రం కదలకుండా ఉండడంతో జనం అనేకరకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరు దెయ్యం ఉందంటే… మరికొందరు గాలికి కూర్చీ అలా వెళ్లిపోయిందటూ చెబుతున్నారు. మొత్తం మీద ఈ వీల్ చైర్ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలియక దీన్ని చూసినవారంతా షాక్‌కు గురవుతున్నారు.