వ్యాయామానికి టైం లేదా..? రోజూ ఇలా రెండు నిమిషాలు చేస్తే చాలు..!!

ఉదయం లేవగానే.. చాలా మంది.. వ్యాయామం చేయనిదే.. ఏ పనీ చేయరు. అది వారి జీవితంలో.. ఒక భాగమైపోతుంది. ఏదో రకంగా.. యోగా.. జాగింగ్, వాకింగ్ చేస్తూంటారు. కానీ.. ఒక్కోసారి.. టైం కుదరకనో.. మరేదేమైనా కారణంతోనో.. ఒకోసారి వ్యాయామాన్ని స్కిప్‌ చేస్తూంటారు. అలాంటప్పుడు ఈ చిట్కా పాటిస్తే సరిపోతుందని.. నిపుణులు చెప్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మేలు చేసే ఎక్సర్‌ సైజ్‌లు ఏమైనా ఉన్నాయా అంటే.. అందులో పుషప్స్ ముందు వరుసలో ఉంటాయనేది నిపుణుల సలహా. సరైన […]

వ్యాయామానికి టైం లేదా..? రోజూ ఇలా రెండు నిమిషాలు చేస్తే చాలు..!!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 28, 2019 | 6:26 PM

ఉదయం లేవగానే.. చాలా మంది.. వ్యాయామం చేయనిదే.. ఏ పనీ చేయరు. అది వారి జీవితంలో.. ఒక భాగమైపోతుంది. ఏదో రకంగా.. యోగా.. జాగింగ్, వాకింగ్ చేస్తూంటారు. కానీ.. ఒక్కోసారి.. టైం కుదరకనో.. మరేదేమైనా కారణంతోనో.. ఒకోసారి వ్యాయామాన్ని స్కిప్‌ చేస్తూంటారు. అలాంటప్పుడు ఈ చిట్కా పాటిస్తే సరిపోతుందని.. నిపుణులు చెప్తున్నారు.

తక్కువ సమయంలో ఎక్కువ మేలు చేసే ఎక్సర్‌ సైజ్‌లు ఏమైనా ఉన్నాయా అంటే.. అందులో పుషప్స్ ముందు వరుసలో ఉంటాయనేది నిపుణుల సలహా. సరైన పద్ధతిలో పుషప్స్ చేస్తే.. శరీరానికి పూర్తిస్థాయి వ్యాయామం చేసినంత మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. పాదాల నుంచి.. తల వరకు మొత్తం శరీరంలోని ప్రతీ అవయవాన్నీ.. ప్రభావితం చేసే శక్తి పుషప్స్‌‌కి ఉందని ఓ అధ్యయనంలో తేలింది.

ప్రతీ రోజూ.. రెండు నిమిషాల పాటు.. మగవారు, ఆడువారు పుషప్స్‌ చేస్తే చాలు.. ఆరోగ్యానికి ఆరోగ్యం కలిసివస్తుంది.. టైంకి టైం సేవ్ అవుతుంది. రోజూ.. మగవారు 40 పుషప్స్, స్త్రీలు 20 పుషప్స్ చేస్తే సరిపోతుందని.. నిపుణులు తెలిపారు. నిత్యం వ్యాయామం చేసే వారితో.. వీరిని పోలిస్తే.. రెండు ఫలితాలు ఒకే విధంగా ఉన్నట్టు వారు చెప్పుకొచ్చారు. చేతులు, కాళ్లు, నడుం కింద.. వెనుక భాగాల్లో కండరాలు ధృడంగా తయారవుతాయని.. అలాగే.. శరీరం మంచి శరీరసౌష్టవం ఏర్పడుతుందనేది నిపుణుల సలహా.