ఆయన కోసం.. విక్రమార్కుడిలా పూరీ ప్రయత్నం.. ఈసారైనా సెట్ అవుతుందా..!

టాలీవుడ్‌లోని చాలామంది దర్శకుల జీవితాశయం మెగాస్టార్‌ చిరంజీవిని డైరక్ట్ చేయడం. ఆ లిస్ట్‌లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఉన్నారు.

ఆయన కోసం.. విక్రమార్కుడిలా పూరీ ప్రయత్నం.. ఈసారైనా సెట్ అవుతుందా..!
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2020 | 4:25 PM

టాలీవుడ్‌లోని చాలామంది దర్శకుల జీవితాశయం మెగాస్టార్‌ చిరంజీవిని డైరక్ట్ చేయడం. ఆ లిస్ట్‌లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఉన్నారు. చిరుతో సినిమా తీయాలని ఆయన ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటిసారి వీరిద్దరి కాంబోలో తెరకెక్కాల్సిన సినిమా స్టార్ట్ అయ్యింది కూడా. కానీ కొన్ని కారణాల వలన సెట్స్‌ మీదకు వెళ్లకుండానే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక ఆ తరువాత చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఆఫర్ కూడా మొదట పూరీకే వచ్చింది. ఆటో జానీ అనే టైటిల్‌తో ఈ మూవీపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ అది కూడా ఆగిపోయింది. ఆ సమయంలో చిరు తీరుపై పూరీ కాస్త అసహనం వ్యక్తం చేశారు. అయినా తన కోరికను ఈ దర్శకుడు చంపుకోలేదు.

టెంపర్ తరువాత వరుస పరాజయాలు వచ్చినప్పటికీ.. ఇస్మార్ట్ శంకర్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన పూరీ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రస్తుతం ఇంట్లో ఉన్న పూరీ.. ఓ కథను తయారు చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే ఎవరి కోసం ఈ కథను రాస్తున్నారన్నది చెప్పకపోయినప్పటికీ.. ఫిలింనగర్ వర్గాల ప్రకారం చిరంజీవి కోసమని తెలుస్తోంది. ఈ సారి ఎలాగైనా ఆయనను ఒప్పించాలనుకుంటోన్న పూరీ.. అదిరిపోయే కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈసారి పూరీ, చిరును ఒప్పిస్తే మాత్రం.. టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ సిద్ధంగా ఉన్నట్లే. మరోవైపు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తోన్న చిరు.. ఆ తరువాత లూసిఫర్ రీమేక్‌లో నటించనున్నారు. ఇక పూరీ సినిమాకు ఆయన ఓకే చెప్తే.. ఈ రెండు చిత్రాల తరువాత ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Read This Story Also: పెళ్లి పీటలెక్కబోతోన్న ‘మహానటి’..పెళ్లికొడుకు ఎవరంటే..!

మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం..
మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??