Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 82 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 182143. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89995. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 86984. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5164. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సి.ఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో చర్చించారు. కంటైన్మేంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను అమలు చేయాలని నిర్ణయించారు. కంటైన్మంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి పూట కర్ఫ్యూ కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ కేసు. కేజీహెచ్ లో రెండో రోజు ముగిసిన సీబీఐ విచారణ. కేజీహెచ్ వైద్యాధికారులతో మాట్లాడిన సీబీఐ అధికారి. సీసీ ఫుటేజీని పరిశీలించిన సీబీఐ. 16 న క్యాజువాల్టీలో డాక్టర్ సుధాకర్ కు పరీక్షలు చేసిన కేజీహెచ్ వైద్యులు.
  • ఢిల్లీ లో కరోనా విజృంభన. ఢిల్లీ లో కొత్తగా 1295 కరోనా పాజిటివ్ కేస్ లు ,13 మంది మృతి. ఢిల్లీ రాష్ట్రంలో 19844 కి చేరిన కరోనా కేసులు నమోదు. 473 మంది కరోనా తో మృతి
  • రుతుపవనాలు ఇంకా కేరళ తీరానికి తాకలేదు. దీని పై మేము క్రమం తప్పకుండా మానిటరింగ్ చేస్తున్నాం. జూన్ 1 నుండి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అనుకుంటున్నాం. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ సమీపంలో ఈ రోజు అల్ప పీడనం ఏర్పడింది. జూన్ 2 కి తుఫానుగా మారుతుందని మేము అనుకుంటున్నాం. జూన్ 3 సాయంత్రం నాటికి గుజరాత్ ,ఉత్తర మహారాష్ట్ర తీరం వైపుకు చేరుకుంటుంది. మృత్యుంజయ్ మోహపాత్రా, ఢిల్లీ IMD.
  • జమ్మూ కాశ్మీర్‌లో సీనియర్ ఐఎఎస్ అధికారి కి కరోనా పాజిటివ్‌. ఆయనతో పాటు సమావేశానికి హాజరైన పలువురు అధికారులు,వైద్యులను హోమ్ క్వారంటైన్ లో వెళ్లాలని సూచన.
  • మొబైల్ సేవల కోసం 11 అంకెల నంబరింగ్ ప్లాన్‌ను ట్రాయ్ సిఫారసు చేసినట్లు కొన్ని మీడియా సంస్థల లో వార్తలు వచ్చాయి. TRAI సిఫారసు ప్రకారం,దేశం లో 10-అంకెల నెంబర్ కొనసాగుతుంది. మేము 11-అంకెల నంబరింగ్ ప్లాన్‌కు మార్చడాన్ని ఖండిస్తున్నాం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.

Pawan Kalyan: పవన్‌తో మూడోసారి.. పూరీ మాట వెనక్కి తీసుకుంటారా..!

రీఎంట్రీలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు సినిమాలకు ఓకే చెప్పారు పవన్. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేయగా.. రెండు మూవీల షూటింగ్‌ల్లో పవన్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు
Puri preparing story for Pawan, Pawan Kalyan: పవన్‌తో మూడోసారి.. పూరీ మాట వెనక్కి తీసుకుంటారా..!

రీఎంట్రీలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు సినిమాలకు ఓకే చెప్పారు పవన్. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేయగా.. రెండు మూవీల షూటింగ్‌ల్లో పవన్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. కాగా ఈ మూడు మూవీలతో పాటు మరికొన్ని చిత్రాలు చేయాలని పవన్ అనుకుంటున్నారట. ఇక ఈ విషయం తెలిసిన దర్శకులు.. పవన్‌కు కథలు చెప్పేందుకు రెడీ అవుతున్నారట. ఈ క్రమంలో పవన్‌ కోసం పూరీ జగన్నాథ్ ఓ కథను రెడీ చేస్తున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ ‘ఫైటర్’ సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పూరీ అనుకుంటున్నారట. ఇక ఆ లోపే పవన్ కోసం ఓ కథను రెడీ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారట. ఒకవేళ పూరీ చెప్పే కథ పవన్‌కు నచ్చితే.. ఈ కాంబినేషన్లో మూడో చిత్రం రావడం ఖాయం. కాగా దర్శకుడిగా పవన్‌ నటించిన ‘బద్రి’ సినిమాతోనే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు పూరీ. ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని సాధించింది. ఈ 2012లో పవన్‌తో మరోసారి ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ మూవీని తెరకెక్కించగా.. ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది. ఇక ఈ మూవీ షూటింగ్ విషయంలో వీరిద్దరి మధ్య అభిప్రాయబేధాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు పవన్‌‌తో తన సంబంధం ఇప్పుడు సరిగా లేదని.. భవిష్యత్‌లో ఆయనతో సినిమాలు చేయకపోవచ్చంటూ అప్పట్లో డైరక్ట్‌గానే కామెంట్లు చేశారు పూరీ. మరి ఇప్పుడు తన మాటను వెనక్కి తీసుకొని.. ఆయనతో సినిమాను తీస్తారా..? లేదా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Read This Story Also: పవన్ కోసం బిగ్ బోట్ సెట్ వేయనున్న క్రిష్..

Related Tags