Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం 18 లక్షల 55 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 1855746 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 586298 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 1230510 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 38938 దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 52050 కరోనా కేస్ లు, 803 మంది మృతి
  • తెలంగాణ బీజేపీ కార్యాలయానికి కరోనా ఎఫెక్ట్. కార్యాలయాన్ని సోమవారం వరకు మూసి ఉంచాలని నిర్ణయించిన రాష్ట్ర నాయకత్వం. జాతీయ పార్టీ కీలక నేతలు కరోనా బారిన పడటంతో రాష్ట్ర కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించ కూడదని నిర్ణయం.
  • అమరావతి : ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం. 3రాజధాని అంశంపై హైకోర్టు విచారణ. రాజధాని తరలింపుపై స్టే ఇచ్చిన హైకోర్టు. గవర్నర్ గెజిట్ పై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్ట్.
  • రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించిన హైకోర్టు. 10 రోజులపాటు స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతున్న హైకోర్టు. రెండు బిల్లులకు సంబంధించి ఇదివరకే గెజిట్‌ విడుదల. తదుపరి కార్యకలాపాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు.
  • అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. కొరియాకు చెందిన సీఈఓ, డైరెక్టర్ సహా మొత్తం 12 మందికి కండిషన్ బెయిల్ ఇస్తూ ఆదేశాలు. స్టెరైన్ గ్యాస్ నిల్వ లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నమోదైన కేసులో వీరిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు.
  • Ccmb డైరెక్టర్ రాకేష్ మిశ్రా . జర్నల్స్ పై ఫార్మాకంపెనీల వత్తిడిపై ట్విట్టర్లో స్పందించిన Ccmb డైరెక్టర్. సైంటిస్టులు, జర్నల్స్ పై వివిధ ఫార్మాకంపెనీలు వత్తిడి చేయడం సరి కాదు. దైవంలా భావించే జర్నల్స్ మీద ఒత్తిడి సిగ్గుచేటు. ఆర్థికంగా బలమైన ఫార్మా కంపెనీలు తమ పరిశోథన పత్రాలను ప్రచురించమని వత్తిడిచేయడం సరైందికాదు . తమ పరిశోధనలను అంగీకరించమని జర్నల్స్ పై వత్తిడి మంచిది కాదు. ది లాన్సేంట్, ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లు వివిధ కంపెనీల వత్తిడిని బయటపెట్టడం ఆందోళన కల్గిస్తోంది.
  • మరో మూడు కార్పొరేట్‌ ఆస్పత్రులకు కోవిడ్ సేవలు కట్...! హైదరాబాద్ లో కరోనా ట్రీట్ మెంట్ చేస్తున్న మరికొన్ని ఆస్పత్రులకు ఆరోగ్య నోటీసులు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ప్రభుత్వం యాక్షన్ .

దర్శకుడు పూరీ జగన్నాథ్ తమ్ముడికి వైసీపీ ఎమ్మెల్యే టికెట్

, దర్శకుడు పూరీ జగన్నాథ్ తమ్ముడికి వైసీపీ ఎమ్మెల్యే టికెట్

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాధ్ సోదరుడు ఉమా శంకర్‌కు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈ మేరకు పార్టీ అధినేత జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తూ నర్సీపట్నం టికెట్‌ను ఉమా శంకర్‌కు కేటాయించారు. పూరీకి సాయిరామ్ శంకర్, ఉమా శంకర్ అనే సోదరులు ఉన్నారు. సాయిరామ్ తన అన్నతో పాటు సినీ ఇండస్ట్రీలో ఉండగా.. ఉమా శంకర్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

గత కొంతకాలంలో వైసీపీలో ఉమా శంకర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో తాజాగా ఆయనకు వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ వరించింది. సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కనిపింస్తున్నాయి. కాగా పూరీ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. గతంలో పూరీ తల్లి సత్యవతి సర్పంచ్‌గా పోటీ చేశారు. మరోవైపు వైసీపీలో సినీ గ్లామర్ పెరుగుతోంది. ఇప్పటికే పోసాని కృష్ణమురళి, జయసుధ, కృష్ణుడు, 30 ఇయర్స్ పృథ్వీ లాంటి తారలు వైసీపీలో ఉండగా.. సోమవారం అలీ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

Related Tags