నేను హిట్స్‌లో ఉంటేనే మహేష్ ఛాన్స్ ఇస్తాడు – పూరి జగన్నాధ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా గురువారం విడుదలై.. అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న పూరి జగన్నాధ్.. సూపర్ స్టార్ మహేష్‌ బాబు‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘మహేష్ బాబుతో రెండు హిట్ సినిమాలు తీశానని.. ఆయన అభిమానులు మరో సినిమా చేయమని అడుగుతున్నట్లు పూరి చెప్పాడు. నిజానికి నాకు మహేష్ బాబు కంటే ఆయన అభిమానులంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే చెబుతున్నా.. నేను హిట్లలో ఉంటేనే మహేష్ నాతో సినిమా చేస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మరోవైపు పూరి జగన్నాధ్ వరుసగా ప్లాప్స్‌లో ఉన్నప్పుడు మొదటిసారి మహేష్ బాబు ఆఫర్ ఇచ్చాడు. ఆంధ్రావాలా, 143, సూపర్ ఇలా వరుస సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిన తర్వాత పూరి.. మహేష్ బాబుతో ‘పోకిరి’ సినిమా తీసి అద్భుత విజయం అందుకున్నాడు. అలాగే మహేష్ పూరితో చేసిన ‘బిజినెస్ మెన్’ సినిమాకి ముందు ‘ఏక్ నిరంజన్, గోలీమార్, నేను నా రాక్షసి’ సినిమాల రూపంలో పూరికి వరుసగా ప్లాప్‌లు ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే మహేష్ బాబు.. పూరి ప్లాప్స్‌లో ఉన్నప్పుడే ఆఫర్ ఇచ్చాడు. కానీ తాజాగా పూరి జగన్నాధ్ ఎందుకు ఇలా మాట్లాడాడు అని మహేష్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ తంతు చూస్తుంటే.. మహేష్ బాబు, పూరి జగన్నాధ్ మధ్య ఏదో గట్టిగా జరిగిందని అర్ధం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *