పూరి ‘జనగణమన’.. పాడేది రాకీ భాయ్.?

‘ఇస్మార్ట్ శంకర్’ హిట్‌తో బ్లాక్‌బస్టర్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌. ఈ సినిమా తర్వాత పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ మూవీ చేయబోతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. ‘పోకిరి, బిజినెస్‌మేన్‌’ సినిమాలతో మహేష్ బాబుకు రెండు హిట్స్ అందించిన పూరి.. ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధించాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ రాసుకున్నానని పూరి ఇదివరకు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల అది కాస్తా పట్టాలెక్కలేదు. తాజా సమాచారం ప్రకారం ‘జనగణమన’ స్టోరీలైన్‌ను […]

  • Ravi Kiran
  • Publish Date - 3:12 am, Thu, 1 August 19

‘ఇస్మార్ట్ శంకర్’ హిట్‌తో బ్లాక్‌బస్టర్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌. ఈ సినిమా తర్వాత పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ మూవీ చేయబోతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. ‘పోకిరి, బిజినెస్‌మేన్‌’ సినిమాలతో మహేష్ బాబుకు రెండు హిట్స్ అందించిన పూరి.. ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధించాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ రాసుకున్నానని పూరి ఇదివరకు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల అది కాస్తా పట్టాలెక్కలేదు.

తాజా సమాచారం ప్రకారం ‘జనగణమన’ స్టోరీలైన్‌ను ‘కెజిఎఫ్’ స్టార్ యష్‌కు పూరి చెప్పడం.. దానిపై యష్ ఆసక్తి చూపించడం జరిగిందట. తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే ప్లాన్‌లో పూరి ఉన్నారనే వార్త వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.