దేవరకొండకు టైటిల్‌ ఫిక్స్ చేసిన పూరీ.. ఈ సారి కాస్త సాఫ్ట్‌గా

Puri Jagannadh locked title for Vijay Deverakonda, దేవరకొండకు టైటిల్‌ ఫిక్స్ చేసిన పూరీ.. ఈ సారి కాస్త సాఫ్ట్‌గా

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో సినిమా ఫిక్స్ అయింది. డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ మూవీ పట్టాలెక్కబోతుంది. పూరీ, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ టైటిల్‌ ఫిక్స్ అయిందన్న వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది.

మామూలుగా తన ప్రతి హీరోను మాస్ అవతారంలో చూపించడంతో పాటు తన టైటిల్స్‌ను కూడా అలానే పెట్టే పూరీ(చాలా సినిమాలకు).. దేవరకొండ కోసం ఫైటర్ అనే టైటిల్‌ను ఖరారు చేశాడట. ఈ మేరకు ఛార్మీ ఫిలింఛాంబర్‌లో ఫైటర్‌ను రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఇక ఇందులో దేవరకొండ సరసన జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు పరిచయం అవుతుందని కూడా సమాచారం.

కాగా ఇటీవల రామ్‌తో ఇస్మార్ట్‌ శంకర్‌ను తెరకెక్కించిన పూరీ.. ఆ మూవీ విజయంతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం సక్సెస్ అవ్వడంతో పాటు రామ్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో ఇప్పుడు విజయ్ దేవరకొండతో తెరకెక్కించబోతున్న మూవీపై కూడా అంచనాలు పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *