‘డబుల్ ఇస్మార్ట్’… పూరి క్లారిటీ!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా గురువారం రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. మాస్ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరధం పడుతున్నారు. అటు పూరి గురువు రామ్ గోపాల్ వర్మ ‘హేయ్ పూరి.. త్వరగా ఇస్మార్ట్ శంకర్ 2 స్టార్ట్ చెయ్. ఈసారి డబుల్ దిమాక్ కాదు ట్రిపుల్ దిమాక్ ఉండాలి’ అంటూ ట్వీట్ కూడా చేశారు.

ఇక ఈ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ పూరి ‘ఆల్రెడీ ‘డబుల్ ఇస్మార్ట్’ టైటిల్ రిజిస్టర్ చేయించాను సర్ అని అభిమానులకు సీక్వెల్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. మరోవైపు ఈ సీక్వెల్‌లో కూడా రామ్ నటిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు పూరి జగన్నాధ్ తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేయలేదు కాబట్టి జెట్ స్పీడ్‌లో సీక్వెల్‌ను తెరకెక్కించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *